Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7 థార్ మార్ థక్కర్ మార్.. హౌస్ నుంచి శివాజీ ఎందుకు బయటకు వచ్చారు..?

ఈ సారి మాత్రం సీజన్ 7 పేరుతో అంతా ఉల్టా పుల్టా అంటూ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ తన నిర్ణయాలను మారుస్తు ఉన్నారు. ఈ సారి సీజన్ అంత తారుమారు థక్కర్ మార్ లా ఉంది. ఈ సీజన్ లో ఎవరు ఉన్న యాక్టర్ శివాజీ మాత్రం శివాజీ వైపే అందిరి చూపు.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బిగ్ బాస్ టాస్క్ లను శివాజీ అర్థం చేసుకున్నంతగా ఎవరు చేసుకోలేదు. మరీ బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేషన్ లేకుండా శివాజీ ఎందుకు బయటకు వచ్చారు..?

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలిమినేషన్ లేకుండా శివాజీ ఎందుకు బయటకు వచ్చారు..?

బిగ్ బాస్ తెలుగులో గత 6 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 7 సీజన్ తో ప్రేక్షకులను తెగ ఆక్షర్శించి స్టార్ మా.. గత 6 సీజన్ లో ఎటువంటి గందరగోళం లేకుండా సీజన్ ముగిసింది.. కానీ ఈ సారి మాత్రం సీజన్ 7 పేరుతో అంతా ఉల్టా పుల్టా అంటూ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ తన నిర్ణయాలను మారుస్తు ఉన్నారు. దీంతో ఇంట్లో ఆటగాళ్ల ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఒకప్పుడు బాగా ఆడినవారు ఆడీయోన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లడం జరిగింది. గత సీజన్ లన్ని కూడా పూర్తిగా ఆడియన్స్ ఓటు ద్వారానే బిగ్ బాస్ అన్న అయ్యేది. ఈ సారి సీజన్ అంత తారుమారు థక్కర్ మార్ లా ఉంది. ఈ సీజన్ లో ఎవరు ఉన్న యాక్టర్ శివాజీ మాత్రం శివాజీ వైపే అందిరి చూపు.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి బిగ్ బాస్ టాస్క్ లను శివాజీ అర్థం చేసుకున్నంతగా ఎవరు చేసుకోలేదు. బిగ్ బాస్ చెప్పి ఇచ్చిన ఆదేశాలు ఆచి తూచి పాటించిన వ్యక్తి ఒక్క శివాజీ ఒక్కరే అని చెప్పకనే చెప్పాలి .. మరీ అంతలా బిగ్ బాస్ హౌస్ ఉల్టా పల్టా ఏం జరిగిందా అనే ప్రశ్నే మీకు వస్తుంది కదా.. అయితే ఇది చదివేయండి..

బిగ్ బాస్ ఇంటి సభ్యులు శివాజీ..

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా తనను తాను నిరూపించుకున్న స్టార్ హీరో శివాజీ. శివాజీ సినీ కెరీర్ అనుకోని కొన్ని కారణాలతో చాలా తొందరగా ముగిసినా.. ప్రజలకు దగ్గరగా ఉంటూ పొలిటికల్ గా మాత్రం చాలా యాక్టివ్ అయ్యారు శివాజీ. ఆ క్రేజ్ తోనే శివాజీ బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఉన్న యంగ్ జనరేషన్ తో ఎంత వరకు మింగిల్ అవుతాడా.. మొదట్లో చాలానే అనుమానాలు వచ్చాయి. కానీ.. వాటి అన్నింటినీ దాటుకుని హౌస్ లో బెస్ట్ గేమ్ ఆడుతున్నారు శివాజీ. నాగార్జున స్టేజ్ పై శివాజీ గేమ్ గురించి పలు సార్లు చెప్తూ వస్తున్నారు. కేవలం టాస్క్ ల విషయంలోనే గాక, కుర్రాళ్ళకి మంచి, చెడు చెపుతూ తప్పును తప్పుగా.. నిజాలను నిర్భయంగా చెబుతూ హౌస్ లో ఓ పెద్ద మనిషిగా గుర్తింపు దక్కించుకున్నారు శివాజీ.

గత వారంతో చాలా వరకు సగం సీజన్ పూర్తి చేసుకున్న శివాజీ కచ్చితంగా ఫైనల్ లిస్ట్ లో ఉంటారని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే సడెన్ గా హౌస్ నుంచి బయటకు వచ్చేసారు శివాజీ ఈ సీన్ తో బిగ్ బాస్ ఆటగాల్లోనే కాదు ప్రేక్షకులు కూడా షాక్ గురయ్యారు. హౌస్ లో అందరి కంటే రూల్ టు రూల్ గేమ్ ఆడేది శివాజీ ఒక్కరే మరి ఎందుక బిగ్ బాస్ శివాజీని బయటకు తీసుకోచ్చింది. అని సందిగ్ధంలో పడిపోయారు. గత వారంలో వైల్డ్ కార్డ్ తో హౌస్ లో అడుగుపెట్టిన పావని ఒక వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్‌లో అమర్‌దీప్‌, టేస్టీ తేజ, అశ్విని, ప్రిన్స్‌ యావర్‌, పూజ, శోభాశెట్టి, నయని పావని ఉండగా చివరకు అశ్విని, నయని పావని మిగిలారు. ఆరోవారం నయని పావని ఎలిమినేట్‌ అయ్యింది. ఈ సందర్భంగా శివాజీ – పావని మధ్య ఎమోషన్ చూస్తే ప్రతి పేక్షకుడిగి కళ్లల్లో నిలు తిరాగాల్సిందే.. ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అయిన ఇంత వరకు ఒక ఇంటి సభ్యులు బయటకు వెలితే ఇంతా ఎమోషన్ అయ్యింది ఎప్పుడు లేదని స్వయంగా నాగార్జున చెప్పడంతో అంత భావోద్వేగానికి గురయ్యారు. ఇంతలో శివాజీ పావని కి బదులుగా ఈ వారం నేను ఎలిమినేట్ అవుతానని.. నా ఆరోగ్యం బాగా లేదు.. చెయ్యి నొప్పి గా ఉంది అని చెప్పి దానికి నాగార్జున.. ఇది ఆడియన్స్ నిర్ణయం మనం ఎం చేయలేము అనడంతో శివాజీ కూడా ఎం చేయలేక పోయారు. ఇలా పావని ఎలిమినేట్ అయ్యిందో లేదు.. శివాజీ ఇంటి సభ్యులతో నేను బయటకు వెళ్లిపోతున్న.. అంటూ షాక్ ఇచ్చాడు. ఇలా నడం తో ఆగలేదు .. వెంటనే డోర్ తెరుచుకోవడం.. శివాజీ బయటకు వెళ్లిపోవడం చకచక జరిగిపోయాయి.

శివాజీ హౌస్ నుంచి బయటకు ఎందుకు వెళ్లారు..?

స్టార్ మా సమాచారం ప్రకారం శివాజీ హౌస్ లోకి వెళ్లక ముందు నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక.. ఆ సమస్యలు మరోసారి ఎక్కువ అయ్యాయి. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఆయన.. ఒకటికి.. రెండు సార్లు తనని బయటకు పంపించమని వేడుకున్నాడు. చాలా సార్లు కూడా నేను వెళ్లిపోతాను వెళ్లిపోతాను అంటున్న.. శివాజీని నాగార్జున పలుమార్లు హెచ్చరించారు. తన ఆరోగ్య పరిస్థితి బయటకు చెప్పుకోలేక శివాజీ అలా ప్రవర్తించారని సమాచారం. గత వారంలో శివాజీ చెయ్యి కు బలమైన గాయం తగిలినట్టు సమాచారం.. చాలా రోజుల నుంచి శివాజీ ఎ టాస్క్ లో పూర్తిగా ఆడటం లేదు .. ప్రతి సారి నాకు చేయి నొప్పిగా ఉంది.. అంటూ పల్లవి ప్రశాంత్ ను రంగంలోకి దింపుతున్నారు. ఇది గమనించి బిగ్ బాస్ శివాజీ ని హౌస్ నుంచి బయటకు తీసుకోచ్చి అతని ఆరోగ్యం పూర్తిగా అధ్యయనం మెరుగైన చికిత్స అందించి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు అని సమాచారం.

గత సీజన్ లో ఇలాంటి పరిస్థితే..

బిగ్ బాస్ సీజన్ 2 రెండులో నుతన్ నాయుడికి ఇలాంటి సమస్య తలెత్తితే బిగ్ బాస్ బయటకు తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయించి మళ్లీ బిగ్ బాస్ లోకి పంపించింది. శివాజీ ని కూడా ఇలాగే సరైన టైం చూసి మళ్లీ పంపిస్తారు అని ప్రేక్షకులు అంటున్నారు.

సీజన్ 4లో నోయెల్, గంగవ్వ, సీజన్ 5లో జెస్సీ ఆరోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వెళ్లి పోయారు. వారు మళ్లి తీరిగి రాలేదు.. ఇలానే బిగ్ బాస్ ఉల్టా పుల్టా అంటేనే ఇలానేమో శివాజీ కూడా రకపోవచ్చన్ని అని మరి కొందరు అంటున్నారు.

ఏది ఏమైనా ఈ సారి సీజన్ లో హౌస్ లో ఉన్న వారి కంటే వారికి ఓటు చేసే వారిలో ఎక్కువ ఆందోళన కనబడుతుంది.

S.SURESH