Kangana Raunat : సె*క్స్‌ బెడ్‌ రూంకే ఎందుకు పరిమితం కాకూడదు? ఒలింపిక్స్‌పై కంగనా సంచలన కామెంట్స్‌

ప్రస్తుతం మొత్తం ప్రపంచం చూపు పారిస్‌ మీదే ఉంది. అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్‌ ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. కానీ ఇలాంటి ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు మాత్రం గతంలో ఎప్పుడు లేనంత దరిద్రంగా నిర్వహించారని ఒలింపక్స్‌ లవర్స్‌ మండిపోతున్నారు. కేవలం నెటిజన్లే కాదు.. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఒలింపిక్స్‌ నిర్వాహకులకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేస్తున్నారు.

ప్రస్తుతం మొత్తం ప్రపంచం చూపు పారిస్‌ మీదే ఉంది. అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్‌ ఇప్పుడు ప్రతీ ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. కానీ ఇలాంటి ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు మాత్రం గతంలో ఎప్పుడు లేనంత దరిద్రంగా నిర్వహించారని ఒలింపక్స్‌ లవర్స్‌ మండిపోతున్నారు. కేవలం నెటిజన్లే కాదు.. సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో ఒలింపిక్స్‌ నిర్వాహకులకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో హీరోయిన, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ట్విటర్‌లో సంచలన పోస్ట్‌ చేశారు. ఒలింపిక్స్‌ను సెక్స్‌ గేమ్‌ చేసేశారంటూ పోస్ట్‌ పెట్టారు.
‘లాస్ట్‌ సప్పర్‌’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌ను కంగనా రనౌత్‌ తప్పుబట్టారు. బ్లూ కలర్‌ వేసుకున్న ఓ వ్యక్తి నగ్నంగా ఉండి తనను తాను జీస్‌సగా చెప్పుకొని క్రైస్తవాన్ని కించపరిచే చర్యలు చేశాడు. క్రీస్తు ధరించే కిరీటాన్ని ఓ మహిళ పెట్టుకోవడం ఆమె చుట్టూ ట్రాన్స్‌ జెండర్లు ఉండటం కూడా ఇప్పుడు వివాదానికి కారణమయ్యింది. దీంతో ఒలింపిక్స్‌ను వామపక్షవాదులు పూర్తిగా హైజాక్‌ చేశారు. ఇది సిగ్గుచేటు’ అని లోక్‌సభ ఎంపీ కంగన సీరియస్‌ అయ్యారు. ఈ ఈవెంట్‌ స్వలింగ సంపర్కంపై ఆధారపడి ఉందని కంగనా రౌత్‌ అన్నారు. ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో ప్రతీదీ స్వలింగ సంపర్కం గురించి హైలెట్‌ చేసినట్టు ఉంది అనేది కంగనా చెప్తున్న పాయింట్‌.

ఈ ఈవెంట్‌లో చిన్న పిల్లలను కూడా భాగస్వాములను చేయడాన్ని కంగనా తప్పుబట్టారు. స్వలింగ సంపర్కానికి తాను వ్యతిరేకం కాకపోయినా.. అసలు ఒలింపిక్స్‌కు సెక్స్‌కి సంబంధం ఏంటి అనేది కంగనా వేస్తున్న ప్రశ్న. ఒలింపిక్స్‌లో లింగవివక్ష ఎందుకు తీసుకువస్తున్నారు.. శృంగారం పడగదికే ఎందుకు పరిమితం కాకూడదు అని ఓ రేంజ్‌లో వేసుకుంది కంగనా. ఆమె చేసిన ఈ పోస్ట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. కంగనా మాట్లాడింది కూడా నిజమే కదా అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. కేవలం సెట్రబిటీలే కాదు. కామన్‌ పీపుల్‌ కూడా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వివాదం రేపాయి. అంతేకాకుండా.. దక్షిణ కొరియా పేరును తప్పుగా పలకడం, ఒలింపిక్స్‌ జెండాను తలకిందులుగా ఎగరువేయడం లాంటి దరిద్రాలన్నీ రోజుకు ఒకటి కనిపిస్తున్నాయి.