టిల్లూ ఎందుకు సైలెంట్ గా ఉన్నడు: రేవంత్ హాట్ కామెంట్స్

ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారు అని ఆయన ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 07:02 PM IST

ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోదీ పారిపోయారు అని ఆయన ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు అని పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15వేల కోట్లు అన్నారు ఆయన. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారు అని మండిపడ్డారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత పండిట్ జవహర్ లాల్ నెహ్రూది అని స్పష్టం చేసారు.

బ్యాంకుల జాతీయకరణతో ఇందిరమ్మ పేదలకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చారు అని సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మది అని తెలిపారు. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీ గారు అని గుర్తు చేసారు. హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉంది అని మండిపడ్డారు. ప్రపంచాన్ని దోచుకునేలా ఆ ఇద్దరి వ్యవహార శైలి ఉంది అని వ్యాఖ్యలు చేసారు. దుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది ఆని విమర్శలు చేసారు రేవంత్.

సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలి అని డిమాండ్ చేసారు. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి అని కోరారు. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే అని స్పష్టం చేసారు. కుంభకోణంపై బీఆరెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? అని నిలదీశారు. వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు అని బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదు అని నిలదీశారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీ పై ఎందుకు మాట్లాడటంలేదు అని మండిపడ్డారు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆరెస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం అని మండిపడ్డారు.