ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ అందించి వారికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని ఒక సంస్థను నెలకొల్పారు. దీనిని గుజరాత్ వేదికగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిధుల మళ్లింపు విషయంలో వచ్చిన తేడా వ్యవహారాలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో చంద్రబాబు కీలకంగా ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. అందుకే అరెస్ట్ చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు అనుమతి కోరింది. అయితే ఇన్నాళ్లు ఎవరూ ఏమీ చేయలేరు అని పదే పదే చెప్పుకొచ్చిన బాబు ఇటీవల కాలంలో సంచలన విషయాలను బయట పెడుతూ వస్తున్నారు. ఏం ఉరితీస్తారా.. అరెస్ట్ చేస్తారు.. అనే మాటలు రావడం చాలా మందిలో ఆసక్తిని కలిగించాయి. అంటే బాబులో ఎక్కడో పాపభీతి మొదలైంది. అతని కాన్ఫిడెంన్స్ దెబ్బతింటుంది. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అప్పట్లోనే ధనిక ముఖ్యమంత్రిగా..
చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న పరిపాలనాదక్షుడు. ఈయన రాజకీయాల్లోకి రాకముందు ఆస్తుల మొత్తం రెండు ఎకరాలు, ఒక పూరి గుడిసె, రెండు పాడి ఆవులు. ఇది అతని అఫిడవిట్లో చూపించిన లెక్కలు. ఇక్కడి నుంచి కేవలం ఐదేళ్ళ ముఖ్యమంత్రి పదవితో దేశంలోనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఎదిగారు. ఇదెలా సాధ్యమైంది అనేది ఇప్పటకీ చాలా మందికి తెలియని విషయం. ఈ విషయాన్ని 2000 సంవత్సరంలో తెహల్కా, ఇండియా టుడే అనే పత్రికలు ఒక ఆర్టికల్ ని ప్రచురించాయి. దేశంలోనే సుపంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబును.. పేద ముఖ్యమంత్రిగా త్రిపులోని మాణిక్యఠాకూర్ అని చెప్పాయి. అలాగే దేశంలోని వ్యవస్థలన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకున్న రాజకీయవేత్తగా కూడా పరిగణించారు.
టెక్నికల్ నాలెడ్జ్ తో గట్టెక్కే చాకచక్యం
ఇప్పటికే చంద్రబాబుపై అనేక అవినీతి, అక్రమ కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నప్పటికీ ఆయనను ఎవరూ ఏమి చేయలేదు. దీనికి కారణం తాను చేసిన తప్పును ఒప్పుకోక పోగా మరో అంశాన్ని లేవనెత్తి విషయాన్ని పక్కతోవ పట్టించే మేధావి అంటున్నారు రాజకీయ నిపుణులు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన 27 కేసుల్లో నిర్ధోషిగా బయటకు వచ్చారు. దీనికి కారణం కూడా టెక్నికల్ గా వెళ్లడమే అని చెబుతున్నారు. అయితే ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ లో మాత్రం సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబే నేరుగా కంపెనీ ప్రతినిథులతో మాట్లాడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, ఆర్థిక శాఖ కార్యదర్శులను తన మాట వినేలా చేశారన్నది ప్రస్తుత వాదన. దీంతో అధికారులు చంద్రబాబు చెబితే చేశాము అని ప్రత్యేకంగా రాసి నిధులు మళ్ళించే ప్రయత్నం చేశారు. దీంతో బాబే సూత్రదారి, పాత్రదారిగా మిగిలిపోయారు. ఇందులో నుంచి తప్పించుకోవడం కష్టమే అంటున్నారు న్యాయవాదులు. దీనికి కారణం నేను తప్పు చేయలేదు అంటున్నారే తప్ప నిధులు తీసుకోలేదు. దాని గురించి నాకు సంబంధం లేదు అని గట్టిగా చెప్పలేక పోతున్నారు.
వ్యవస్థలను పనిచేసుకోనిచ్చే పాలకులు..
గతంలో పాలకులు రాజకీయ నాయకుల అండదండలతో ఎదగడం, లేదా వారి కనుసైగల్లో నలగడం చూశాం. కానీ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమం తాను చేసుకుంటూ.. పరిపాలనలో జోక్యం చేసుకోకుండా ఉన్నారన్నది వెలుగులోకి వస్తున్న అంశం. దీంతో నిబద్దతతో కూడిన ఉన్నతాధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు వీలు ఉండటంతోనే ఇలాంటి అక్రమాలు బయటకు వస్తున్నాయని తెలుస్తుంది. పైగా సీఐడీ ప్రధాన అధికారి కూడా ఈ కోవలోకి చెందిన వారే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలకు తావివ్వకుండా ఖచ్చితత్వంతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందారని తెలుస్తోంది. అలాంటి వ్యక్తి రంగంలోకి దిగి అరెస్ట్ చేశారంటే ఇందులో చాలా లోతున్నా అంశంగా భావిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఉన్న కేసులు..
చంద్రబాబు గతంలో కొన్ని కేసులపై స్టే తెచ్చుకున్నప్పటికీ కొన్ని మాత్రం కొట్టివేయబడ్డాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా అరెస్టయిన స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక్క కేసుతో మిగిలిన కేసులన్నీ ముడిపడి ఉన్నాయి. ఫైబర్ నెట్, అమరావతి రింగురోడ్డు డైవర్షన్ స్కాం, అసైన్డ్ భూములు బదలాయింపులు, భవన నిర్మాణాల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అనేక ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తే ఈ కేసుల్లో చంద్రబాబు వెనుక ఉన్న వ్యక్తులు తప్పు ఒప్పుకునే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. వారిని ఆధారంగా చేసుకొని చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. ఇప్పుడు జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కూడా జరిగింది ఇదే. ఎవరి పేరును అడ్డం పెట్టకొని ఈ స్కామ్ కు పాల్పడ్డారో వారినే విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో చంద్రబాబుపై అరెస్ట్ అస్త్రాన్ని గురిపెట్టారు సీఐడీ అధికారులు.
ఈ ఒక్కకేసులో బాబు బలంగా చిక్కుకుంటే మిగిలిన వారందరూ కూడా తమ కేసుల దర్యాప్తులో వేగం పెంచే అవకాశం కనిపిస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఏపీ రాజకీయ చరిత్రలోనే మరిచిపోని అధ్యయనంగా ప్రతి ఒక్కరూ గుర్తుండి పోతుందని అంటున్నారు.
T.V.SRIKAR