CM Revanth Reddy, Etela : రేవంత్‌ బాటలోనే ఈటెల.. మల్కాజ్‌గిరి కలిసివస్తుందా ?

తెలంగాణ రాజకీయాల్లో ఎందరు నేతలు ఉన్నా సీఎం రేవంత్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ స్థానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ వేవ్‌ ఉన్న టైంలో.. కేసీఆర్‌ను కొట్టేవాడు లేడు అని రాష్ట్రమంతా అనుకుంటున్న సమయంలో.. హుజురాబాద్‌ బైపోల్‌లో బీఆర్ఎస్‌ వేవ్‌ను ఢీకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటెల రాజేందర్‌.

 

తెలంగాణ రాజకీయాల్లో ఎందరు నేతలు ఉన్నా సీఎం రేవంత్‌ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ స్థానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ వేవ్‌ ఉన్న టైంలో.. కేసీఆర్‌ను కొట్టేవాడు లేడు అని రాష్ట్రమంతా అనుకుంటున్న సమయంలో.. హుజురాబాద్‌ బైపోల్‌లో బీఆర్ఎస్‌ వేవ్‌ను ఢీకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటెల రాజేందర్‌. బీఆర్ఎస్‌ను బీట్‌ చేసే నాయకుడు లేడు అనుకునే చాలా మందికి.. బీఆర్ఎస్ కూడా ఒక నార్మల్‌ పార్టీనే అని తన గెలుపుతో అర్థమయ్యేలా చేశారు. రేవంత్‌ రెడ్డికి కూడా తెలంగాణలో ఇలాంటి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. తెలంగాణలో ఇక లేదు అనుకున్న కాంగ్రెస్‌ పార్టీకి ప్రాణం పోశారు.

బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ఆల్టర్నేటివ్‌ అని అంతా అనుకుంటున్న సమయంలో.. డే అండ్‌ నైట్‌ కష్టపడి ఏకంగా అధికారాన్ని సాధించి సీఎం సీట్‌లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలకు ఉన్న ఓ కామన్‌ కంపేరిజన్‌.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌ రెడ్డి సీఎం అవడం కంటే ముందు మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆయనను నియమించింది. ఆ అవకాశాన్ని కరెక్ట్‌గా వాడుకున్న రేవంత్‌ రెడ్డి.. పార్టీ కేడర్‌ను నాయకులను ఒక్క తాటిమీదకు తెచ్చి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఈటెల రాజేందర్‌ కూడా అదే మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నుంచి ఎంపీగా ఉన్నారు.

ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్ ఏంటి అంటే.. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటెల పేరే ప్రథమంగా వినిపింస్తోంది. త్వరలోనే ఆయను తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించే అవకాశమున్నట్టు టాక్‌ నడుస్తోంది. రేవంత్‌ ఇక్కడి నుంచే గెలిచి పార్టీ అధ్యక్షుడు అయ్యి సీఎం అయ్యాడు. ఇప్పుడు ఈటెల కూడా దాదాపు అదే లేన్‌లో ట్రావెల్‌ అవుతున్నారు. దీంతో ఈటెల కూడా త్వరలోనే తెలంగాణకు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన అభిమాన వర్గంలో టాక్‌ నడుస్తోంది. ఇలాంటి మ్యాజిక్‌లు జరిగే అవకాశ తక్కువే అయినా.. ఈటెల కూడా మామూలు నాయుకుడు కాదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వేవ్‌ కొనసాగుతున్న టైంలో కూడా కేసీఆర్‌ తరువాత నెంబర్‌ 2 నేతగా ఆయనకు పేరుంది. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫేమ్‌ ఉందో.. ఈటెల రాజేందర్‌కు కూడా అదే స్థాయిలో ఫేమ్‌ ఉంది. దీంతో ఆయన సీఎం అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్‌ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా గెలిపించిన మల్కాజ్‌గిరి ఈటెలకు ఎలాంటి ఫ్యూచర్‌ని ఇస్తుందో చూడాలి.