కవితక్కకు బెయిల్ వస్తుందా…?

లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది.

  • Written By:
  • Updated On - August 12, 2024 / 11:38 AM IST

లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడి, సీబిఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. కవిత పిటిషన్ ను జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించాయి.

ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టును గడప తొక్కారు కవిత. ఢిల్లి లిక్కర్ కేసులో కవితను మార్చి 15 న ఈడి, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కవిత మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఈ కేసులో మానిష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కూడా జైల్లోనే ఉన్నారు.