తెలుగు ప్లేయర్ పై సన్ రైజర్స్ కన్ను ముంబై వదులుకుంటుందా ?

ఐపీఎల్ మెగావేలం ముంగిట పలు ఆసక్తికర వార్తలు షికారు చేస్తున్నాయి. రిటెన్షన్ కు సంబంధించి నిబంధనలు ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ సగటున ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు లేదా ఐదుగురిని తమతో పాటే కొనసాగించుకునే అవకాశముంటుంది.

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 06:50 PM IST

ఐపీఎల్ మెగావేలం ముంగిట పలు ఆసక్తికర వార్తలు షికారు చేస్తున్నాయి. రిటెన్షన్ కు సంబంధించి నిబంధనలు ఇంకా వెల్లడి కాకపోయినప్పటికీ సగటున ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు లేదా ఐదుగురిని తమతో పాటే కొనసాగించుకునే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వేలంలోకి వదిలేయాలి అన్న దానిపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. దీనిలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వేలం కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది. బ్యాటింగ్ ను మరింత బలోపేతం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై సన్ రైజర్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

అయితే మెగా వేలం రూల్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో అతను వేలంలోకి రానున్నాడు. అయితే రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ద్వారా ముంబై తీసుకుంటే మాత్రం సన్ రైజర్స్ కు కష్టమే. ఒకవేళ తిలక్ వర్మ వేలంలోకి వస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అతని కోసం గట్టిగానే ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. తిలక్ వర్మతో పాటు మరికొంత మంది భారత స్టార్ ఆటగాళ్లపై సన్‌రైజర్స్ ఫోకస్ పెట్టింది. తిలక్ వర్మను తీసుకుంటే లోకల్‌గా కూడా తమకు కలిసొస్తుందని ఆ జట్టు భావిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటం, గత సీజన్లో వరల్డ్ బెస్ట్ బౌలర్లపై అతని ఆధిపత్యం కనబరిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది.