సచిన్ రికార్డును కొట్టేస్తాడా ? టెస్టుల్లో రూట్ దూకుడు

వరల్డ్ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్టుగా సచిన్ పేరే చెబుతారు.. మరి టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టే సత్తా ఉన్న ఆటగాడు ఎవరంటే కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. ఇప్పటికే వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు కూడా విరాట్ బ్రేక్ చేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం కాస్త వెనుకబడ్డాడు.

  • Written By:
  • Publish Date - August 30, 2024 / 08:00 PM IST

వరల్డ్ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్టుగా సచిన్ పేరే చెబుతారు.. మరి టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టే సత్తా ఉన్న ఆటగాడు ఎవరంటే కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. ఇప్పటికే వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు కూడా విరాట్ బ్రేక్ చేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు కోహ్లీని కూడా వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ సచిన్ రికార్డును దాటేసేందుకు దూసుకెళుతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ ను ఆస్వాదించడంలో ఇంగ్లీష్ క్రికెటర్లను మించిన వారు లేరని రూట్ జోరును చూస్తే అర్థమవుతోంది. అందరూ వన్డే లేదా టీ ట్వంటీలకు ప్రయారిటీ ఇస్తే రూట్ మాత్రం దీనికి భిన్నంగా టెస్టుల్లో దుమ్మురేపుతున్నాడు. బజ్ బాల్ కాన్సెప్ట్ ను బాగా అలవాటు చేసుకున్న రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు.

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రన్ మెషీన్ గా మారిపోయిన రూట్ సచిన్ అత్యధిక పరుగుల రికార్డుపై కన్నేశాడు. తన కెరీర్‌లో 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలతో మొత్తం 15 వేల 921 పరుగులు చేశాడు. మరోవైపు 2012లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన జో రూట్ 145 టెస్టులాడి ఇప్పటికే 33 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలతో 12,274 పరుగులు చేశాడు. మరో 3 వేల 647 పరుగులు చేస్తే సచిన్ రికార్డును దాటేస్తాడు. ప్రతి ఏడాదీ ఇంగ్లాండ్ కనీసం 12-14 టెస్టు మ్యాచ్‌లను ఆడుతుంది. దీంతో రూట్‌ ఇదే ఫామ్‌, ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తే సచిన్ రికార్డ్‌ అందుకోవడం పెద్ద కష్టం కాదని అంచనా వేస్తున్నారు.