నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరవింద్ కేజ్రీవాల్. గత విచారణ సందర్భంగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిబిఐ కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ 26న అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది సిబిఐ. లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో కవిత కూడా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురికి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కవితకు మాత్రం బెయిల్ రాకపోవడం బీఆర్ఎస్ అధిష్టానాన్ని కలవరపెడుతోంది.