Parliament Budget Sessions 2024: ఆదాయ పన్ను పరిమితి పెంచుతారా ? రేపటి నుంచి పార్లమెంట్ సెషన్స్ !

లోక్ సభ ఎన్నికల ముందు పార్లమెంట్ (Parliament) లో తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏ-2 (NDA2) పాలనలో ఇదే చివరి బడ్జెట్. ఈ సెషన్స్ అయిపోయాక లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. అందువల్ల ఈ బడ్జెట్ లో ఆదాయం పన్నుపై ఎలాంటి గుడ్ న్యూస్ ఉంటుందో అని వేతనజీవులు ఎదురు చూస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల ముందు పార్లమెంట్ (Parliament) లో తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏ-2 (NDA2) పాలనలో ఇదే చివరి బడ్జెట్. ఈ సెషన్స్ అయిపోయాక లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. అందువల్ల ఈ బడ్జెట్ లో ఆదాయం పన్నుపై ఎలాంటి గుడ్ న్యూస్ ఉంటుందో అని వేతనజీవులు ఎదురు చూస్తున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగబోతున్నాయి. ఈ సమావేశంలో ఫిబ్రవరి 1 నాడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తాత్కాలిక బడ్జెట్ ను (#Budget 2024) ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. అందుకే ఎన్నికల బడ్జెట్ గా ఇందులో ఎలాంటి ప్రజాకర్షక నిర్ణయాలను ప్రకటిస్తారని జనం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా తాత్కాలిక బడ్జెట్ లో జనాన్ని ఆకట్టుకునే పథకాలు ఏవీ ఉండవు. కానీ ఎన్నికల ముందు కాబట్టి కనీసం ఆదాయం పన్ను పరిమితి (Income Tax slabs) అయినా పెంచుతారా అని ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆదాయంపన్ను విధానంలో ప్రస్తుతం ఉన్న పాత విధానంలో పరిమితి రెండున్నర లక్షలు ఉండగా… కొత్త విధానంలో 3 లక్షలుగా ఉంది.

ఇప్పుడు ఈ రెండు పరిమితులను పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే ఇన్ కమ్ ట్యాక్స్ లో సెక్షన్ 80సీ కింద ఇచ్చే మినహాయింపులను లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ను కూడా ప్రస్తుతం ఉన్న 50 వేల రూపాయల నుంచి లక్షకు పెంచాలని కోరుతున్నారు. HRA మినహాయింపు, ఆరోగ్య బీమా ప్రీమియం తగ్గింపు పరిమితిని కూడా కేంద్రం పెంచాలని ఆశిస్తున్నారు. ఇంటి రుణాల EMIల కింద నెల నెలా వేల రూపాయలు చెల్లించే ఉద్యోగులు చాలా మంది కొత్త పన్ను విధానం వైపు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంటి రుణాల వడ్డీల మినహాయింపులే ఇందుకు కారణం. ఈ మినహాయింపులను కొత్త ట్యాక్స్ సిస్టమ్ కి కూడా అమలయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ని ప్రోత్సహించేందుకు ఫేమ్ 1, ఫేమ్ 2 అని రెండు దశల్లో పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఇందులో భాగంగా EV ల కొనుగోలుపై రాయితీలు ఇస్తోంది. ఫేమ్ 2 గడవు మార్చితో ముగుస్తుండటంతో అయితే ఫేమ్ 3 ని ప్రవేశపెట్టనుంది. ఎన్నికల ఏడాది కావడంతో రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం వరాలు ప్రకటిస్తుందని భావిస్తున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ రంగాలకు కూడా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.