CM Revanth Reddy : ఎన్నిలక ఫలితాల తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదా ?

పార్లమెంట్‌ రిజల్ట్‌ (Parliament Result) తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఉంటుందా ఉండదా ? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్న హాట్‌ టాపిక్‌ ఇదే.

 

పార్లమెంట్‌ రిజల్ట్‌ (Parliament Result) తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఉంటుందా ఉండదా ? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడున్న హాట్‌ టాపిక్‌ ఇదే. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకూ ప్రతీ వర్గంలో ఇదే చర్చ జరుగుతోంది. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ (BJP) కి 10 సీట్లు వస్తే.. ఖచ్చితంగా కాంగ్రెస్‌ (Congress Party) గవర్నమెంట్‌ను కూల్చేస్తారు అని చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు. ఇది ఎంత వరకూ నిజం అనే విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌ (Congress) బీజేపీ మధ్యే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓడిపోవడం, నేతలంతా వేరే పార్టీలకు వెళ్లిపోవడంతో బీఆర్‌ఎస్‌ చాలా వీక్‌ అయ్యింది. పట్టు నిలుపుకోవడం తప్ప.. గెలుపు అనే మాటకు ఇప్పుడు బీఆర్ఎస్‌ (BRS) పార్టీ అనర్హం. ఆగస్ట్‌ తరువాత కాంగ్రెస్‌లో సంక్షోభం తప్పదు అని బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. కాంగ్రెస్‌లో షిండేలు పుట్టుకొస్తారని మాజీ మంత్రి హరీష్‌ రావు కూడా ప్రతీ సారి చెప్తున్నారు.

దీంతో బీజేపీ (BJP) తెలంగాణలో బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడుతుంది అని చాలా మంది విశ్లేశిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో కొత్త పీసీసీని (PCC) నియమించబోతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పైరవీలు నడుస్తున్నాయి. ఎప్పటిలాగే చాలా మంది సీనియర్లు పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ పదవి విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా.. కాంగ్రెస్‌ పతనానికి అదే తొలిమెట్టు అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు రేవంత్‌ దోషిగా ఉన్న ఓటుకునోటు కేసు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ను టెన్షన్‌ పెడుతోంది. ఈ కేసులో రేవంత్‌కు శిక్ష పడితే ఖచ్చితంగా పదవి పోయే ప్రమాదముంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఈ రెండు కారణాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. ఐతే ఇవేవి సాధ్యమయ్యేవి కాదు అనేవాళ్లు కూడా ఉన్నారు.

తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్‌ ప్లేస్‌ను నెమ్మదిగా బీజేపీ ఆక్రమిస్తోంది. ఇదే పద్దతి కంటిన్యూ చేస్తే ఇక బీఆర్ఎస్‌ ఉనికి కూడా తెలంగాణలో ఉండదు. అలా కాకుండా బీఆర్‌ఎస్‌ను తమతో కలుపుకున్నా బీజేపీకి నష్టమే. ఎందుకంటే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయినా.. బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో భారీ ఓటింగ్‌ వచ్చింది. కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌కు మధ్య ఉన్న ఓటింగ్‌ తేడా 2 శాతం మాత్రమే. ఇలాంటి టైంలో బీజేపీ బీఆర్ఎస్‌ను కలపుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడితే.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్‌ ఎదుగుతుంది. ఇదే జరిగితే బీజేపీ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. దీంతో బీజేపీ బీఆర్‌ఎస్‌ రెండూ కలిసే అవకాశం లేదు అనేది కొందరి వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా.. పార్లమెంట్‌ రిజల్ట్‌ తరువాత ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.