కోలుకోని కేన్ మామ మూడో టెస్టుకూ దూరం

టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మాజీ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు.

  • Written By:
  • Publish Date - October 29, 2024 / 03:10 PM IST

టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మాజీ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగానే విలియమ్సన్‌ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ దృష్ట్యా విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని కివీస్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్‌ ఇప్పటికే సిరీస్‌ కైవసం చేసుకుంది. పుణే టెస్టులో రోహిత్ సేనను నిలవరించిన కివీస్ తొలిసారి భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. కాగా సిరీస్ లో చివరిదైన మూడో టెస్ట్‌ ముంబై వేదికగా నవంబర్‌ 1న ప్రారంభం కానుంది.