ఎందుకంటే ఈ నెలలో ఏకంగా 14 సెలవులు ఉన్నాయి. ప్రతీ నెల ఫస్ట్ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌లకు హాలీడే క్యాలెండర్ ఇస్తుంది. జులై నెల క్యాలెండర్‌లో ఇండియాలో బ్యాంకులకు జులైలో 14 సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 14 సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు. ఆదివారం కాకుండా ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా జరుపుకునే పండగలు జులై నెలలో ఎక్కువగా ఉన్నాయి. జులై 5న గురు గోవింద్ జయంతి సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. జులై 6న మిజోరాం స్టేట్‌లో బ్యాంకులకు ఎంహెచ్ఐపీ సెలవు ఉంది. జులై 8న రెండో శనివారం కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
జులై 11న కేరా పూజ సందర్భంగా త్రిపురాలో బ్యాంకులకు హాలిడే. జులై 13న భాను జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జులై 17న యూ తిరోట్ సింగ్ డే సందర్భంగా మేఘాలయలో బ్యాంక్‌లకు హాలిడే ఇచ్చారు. జులై 22న నాలుగో శనివారం కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 29న మొహర్రం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చారు. జులై 31న షహాదత్ సందర్భంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. ఇలా జులైలో ఆదివారాలు తీసేస్తే మొత్తం 10 సెలవులు ఉన్నాయి. ఆదివారాలతో కలిపి ఓవరాల్‌గా 14 రోజులు బ్యాంక్‌లకు హాలిడే. ఇక సెప్టెంబర్ చివరి నాటికి రూ. 2వేల నోటు ప్రతి ఒక్కరూ మార్చుకోవాలన్న నిబంధన అమలులో ఉంది. ఇలాంటి తరుణంలో ఈ వరుస బ్యాంకు సెలవులు సామాన్యునికి ఆటంకిగా మారుతాయా లేదా అనేది వేచిచూడాలి.