VIRAL VIDEO: దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో హోలీ సంబరాలు ఊపందుకున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అంతా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఈ ఇన్సిడెంట్ మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ క్రియేట్ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రోలో హోలీ ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.
Devineni Uma: రాజ్యసభకు ఉమా! దేవినేనికి చంద్రబాబు హామీ..
మెట్రోలో హోలీ ఆడుకోవడమే దరిద్రం అంటే.. వీళ్లు రొమాన్స్ చేస్తూ రంగులు పూసుకోవడం ఇప్పుడు మరింత దరిద్రంగా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే అదేదో వాళ్ల బెడ్‌రూం అయినట్టు హద్దు మీరి మరీ రంగులు పూసుకున్నారు ఈ ఇద్దరు యువతులు. ఇలాంటి వీడియోల వల్ల పరువు పోతుంది అని వాళ్లకు కూడా తెలుసు. కానీ వీడియో చేయాలి.. అది వైరల్ అవ్వాలి.. అంతా వాళ్లను గుర్తుపట్టాలి.. ఇదే రీల్స్ బ్యాచ్‌కు ఉండే మెంటాలిటీ. ఆ మెంటాలిటీతోనే ఇలాంటి వీడియోలు తీసి రొచ్చు చేస్తుంటారు. ఇతర ప్రయాణికులను ఇబ్బందులు పెడుతుంటారు. కేవలం ఇదే కాదు.. ఏదో ఒక వీడియోతో ఢిల్లీ మెట్రో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంది. అమ్మాయిల పోల్ డ్యాన్స్, లవర్స్ అశ్లీల వీడియోలు, రీల్స్, సెల్ఫీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ మెట్రో వీడియోల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు కొత్తగా ఈ హోలీ వీడియో ఒకటి తయారయ్యింది.
ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవాళ్లంతా.. ఇదే పోయే కాలం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి వాళ్లను మెట్రో ఎక్కనివ్వొద్దంటున్నారు. మెట్రో అధికారులు కూడా ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.