జడ్డూ మరో ఆరేస్తే… ఊరిస్తున్న వరల్డ్ రికార్డ్

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముంగిట భారత క్రికెటర్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. జడ్డూ మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధిస్తాడు.

  • Written By:
  • Publish Date - September 17, 2024 / 06:38 PM IST

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముంగిట భారత క్రికెటర్లను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. జడ్డూ మరో 6 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధిస్తాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా.. నాలుగో స్పిన్నర్‌గా చరిత్రకెక్కనున్నాడు. 2012లో టెస్టుల్లో అడుగుపెట్టిన జడేజా ఇప్పటి వరకు 75 టెస్ట్ మ్యాచ్‌లలో 294 వికెట్లు తీసాడు. గతంలో 300 వికెట్ల కంటే ఎక్కువ తీసిన భారత స్పిన్నర్ల జాబితాలో అనిల్ కుంబ్లే , రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించనున్న 8వ భారత బౌలర్‌గా నిలవనున్నాడు.