13 ఏళ్ళకే వరల్డ్ రికార్డ్.. ఎవరీ సూర్యవంశీ ?

మన దేశంలో క్రికెట్ టాలెంట్ కు కొదవే లేదు... ప్రతీ రాష్ట్రం నుంచి ఎంతో మంది నైపుణ్యమున్న ఆటగాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. వారికి సరైన కోచింగ్ లేకనో ఇతర కారణాల వల్లనో చాలా మంది ప్రతిభ వెలుగులోకి రాకుండానే పోతూ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 04:50 PM IST

మన దేశంలో క్రికెట్ టాలెంట్ కు కొదవే లేదు… ప్రతీ రాష్ట్రం నుంచి ఎంతో మంది నైపుణ్యమున్న ఆటగాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. వారికి సరైన కోచింగ్ లేకనో ఇతర కారణాల వల్లనో చాలా మంది ప్రతిభ వెలుగులోకి రాకుండానే పోతూ ఉంటుంది. అయితే అవకాశం వచ్చిన యంగస్టర్స్ మాత్రం దుమ్మురేపుతున్నారు. తాజాగా భారత అండర్ 19 జట్టులో బిహార్ కు చెందిన ఓ యువ క్రికెటర్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరుగుతున్న నాలుగురోజుల మ్యాచ్ లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మెరుపు శతకం బాదాడు.కేవలం 62 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు.

ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో శతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. 13 ఏళ్ల 188 రోజుల వయసులో సూర్యవంశీ శతకం సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో పేరిట ఉండేది. ఈ రికార్డును సూర్యవంశీ బద్దలుకొట్టాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 214 పరుగులకు ఆలౌటైంది. తర్వాత 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన 13 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురుస్తున్నాయి.