వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి వరకూ టీమిండియా ఫైనల్ కు ఖచ్చితంగా చేరుతుందన్న అంచనాలుంటే వరుస ఓటములతో వెనుకబడిపోయింది. ఇప్పుడు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా టాప్ ప్లేస్ కు దూసుకెళ్ళింది. లంకపై సిరీస్ ను 2-0తో గెలవడంతో 63.33 పాయింట్లతో సౌతాఫ్రికా మొదటి స్థానానికి చేరుకుంది. అదే సమయంలో 60.71 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిస్తే… అడిలైడ్ టెస్ట్‌లో ఓటమితో భారత్ 57.29 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటుంది. మరో బెర్తు కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య గట్టిపోటీ నడుస్తోంది. భారత్ మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోనుంది.