Elon Musk: సరికొత్త ఫీచర్లతో ‘ఎక్స్’.. సబ్ స్క్రిప్షన్ ప్లాన్ వివరాలు ఇవే

'ఎక్స్' ట్విట్టర్ నుంచి సరికొత్త ఫీచర్. రెండు సరికొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ముందుకు వచ్చింది. ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ల్స్ కోసం రూ. 243.75 చెల్లించాలని తన 'ఎక్స్' ట్విట్టర్ అకౌంట్ వేదికగా తెలిపింది.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 03:24 PM IST

‘ఎక్స్’ ట్విట్టర్ ఈ పేరు తెలియని వారు ఈ జనరేషన్లో ఎవరూ ఉండరు. ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థి మొదలు ప్రొఫెషనల్ వర్క్ చేసే పౌరుని వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగస్వామ్యం అయిపోయింది. గతంలో ‘ఎక్స్’ ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్, నాన్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి దీనిని అప్డేట్ చేస్తూ నూతన ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. అవే ప్రీమియం +, బేసిక్ ప్రీమియ ప్లాన్సు. వీటి పేర్లతో పాటూ సబ్ స్క్రిప్షన్ ధరల్లో కూడా మార్పులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రీమియం +:

ఈ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్న వినియోగదారులు నెలకు 16 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 1300 అనమాట. ఇలా చేయడం వల్ల ఇందులోని యూజర్లతో పాటూ వారిని ఫాలో అయ్యే వారి నుంచి వచ్చే ప్రకటనలను తీసివేసేందుకు అవకాశం ఉంటుంది. పైగా మన అకౌంట్ కు ప్రైవసీ తో పాటూ పాపులారిటీ అధికంగా పెరుగుతుంది. ఇందులో రిప్లై బూస్ అవకాశాన్ని కల్పించడంతో పాటూ క్రియేటర్ టూల్స్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. పైగా బ్లూ టిక్ మార్క్ ని అందజేస్తారు.

బేసిక్ ప్రీమియం:

ఈ ప్లాన్ ను వినియోగించాలంటే నెలకు 3 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. అంటే భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 243.75 అనమాట. దీనిని సబ్ స్క్రైబ్ చేసుకోవడం వల్ల బ్లూ టిక్ మార్క్ అవకాశాన్ని ఇవ్వరు. మనం ఏదైనా పోస్ట్ లు చేసిన తరువాత వాటిని తిరిగి ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అలాగే పొడవైన వాక్యాలను రాసేందుకు వీలుంటుంది. ఎక్కువ లెంతీ వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ప్రైమరీ టూల్స్ అందుబాటులో ఉంటాయి.

త్వరలో రానున్న ఫీచర్లు:

ఈ రెండు ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్లను వెబ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఎక్స్ ట్వట్టర్ ఇటీవల ఆడియో, వీడియో కాల్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వేదికను ఎవ్రీథింగ్ యాప్ గా డెవలప్ చేసే క్రమంలో ఇలాంటి సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలో యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ చేసే యాప్ గా దీనిని మార్చే అవకాశం ఉందంటున్నారు సంస్థ ప్రతినిథులు.

T.V.SRIKAR