YCP DECIDE : జగన్ సీఎం అని వైసీపీ ఫిక్స్.. విశాఖలో ఏర్పాట్లు – హోటల్స్ బుకింగ్

ఏపీ అసెంబ్లీ సహా దేశమంతటా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి. ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోటా పోటీ నడుస్తోంది.

ఏపీ అసెంబ్లీ సహా దేశమంతటా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న రాబోతున్నాయి. ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోటా పోటీ నడుస్తోంది. వైసీపీ, కూటమి మధ్య టగ్ వార్ ఉన్నా… వైసీపీ నేతలు మాత్రం మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ఫిక్స్ అయిపోయారు. వైజాగ్ లో జూన్ 9న జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ముహూర్తం పెట్టేశారు మంత్రి బొత్సా సత్యనారాయణ. ఏపీలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఈమధ్యే విశాఖ సిటీలో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది. మాచర్లలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా ఉన్న టైమ్ లో సీఎస్ జవహర్ రెడ్డి కూడా వైజాగ్ పర్యటనకు వెళ్ళారని టీడీపీ ఆరోపిస్తోంది. అంటే ప్రభుత్వ అధికారులు కూడా జగన్ సీఎంగా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని డిసైడ్ అయ్యారు.

వైజాగ్ లో జూన్ 9 కోసం ముందస్తుగా హోటల్ రూమ్స్ కూడా బుక్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా హోటళ్ళల్లో రూమ్స్ ని బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. VIPలు, VVIPల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. రిజల్ట్ వచ్చాక… ప్రమాణస్వీకార వేదికను ఫిక్స్ చేస్తారట. ప్రస్తుతం మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఉంటుందని వైజాగ్ వైసీపీ నేతలు భావిస్తున్నారు.

అటు టీడీపీ కూటమి కూడా ఈసారి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. చంద్రబాబు సీఎంగా అమరావతి పరిధిలో ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. టీడీపీ కూడా జూన్ 9 డేట్ నే ఫిక్స్ చేసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో గానీ… వైసీపీ నేతలు మాత్రం ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో కాస్త ముందున్నారు. దాంతో జూన్ 4 ఎన్నికల ఫలితాల కోసం ఏపీ జనంలో టెన్షన్ పెరుగుతోంది.