YCP INCHARGES: వైసీపీ అభ్యర్థులకు తడిసి మోపెడు.. కోట్లు ఖర్చు పెట్టాక దక్కని సీటు

ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికి 13 లిస్టులు రిలీజ్ చేసింది వైసీపీ హైకమాండ్. 80 మందికి పైగా సిట్టింగ్స్‌ని మార్చింది. ఒక జాబితాలో పేరు ప్రకటించి.. మరో లిస్టులో మార్చేస్తుండటంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

  • Written By:
  • Updated On - March 13, 2024 / 02:12 PM IST

YCP INCHARGES: నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జుల మార్పు వ్యవహారం కొందరు అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. మొదట ప్రకటించిన అభ్యర్థులను తర్వాత కొన్ని రోజులకే మార్చేస్తుండటంతో.. కోట్లల్లో నష్టపోతున్నారు. చిలకలూరి పేట అభ్యర్థి మల్లెల రాజేష్ ఇలాగే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మంత్రి విడదల రజనీకి ఆరున్నర కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. కానీ ఆయన్ని వైసీపీ అధిష్టానం ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో అంతా నష్టమేనని లబోదిబోమన్నారు.

APPSC Group -1 Mains: 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..

ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికి 13 లిస్టులు రిలీజ్ చేసింది వైసీపీ హైకమాండ్. 80 మందికి పైగా సిట్టింగ్స్‌ని మార్చింది. ఒక జాబితాలో పేరు ప్రకటించి.. మరో లిస్టులో మార్చేస్తుండటంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. లిస్టులో పేరు రాగానే.. ఆ అభ్యర్థి నుంచి పార్టీ ఫండ్ కోసం సీనియర్ నేతలు భారీగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. చిలకలూరి పేట వైసీపీ నేత రాజేష్ నాయుడు ఇలాగే మంత్రి విడదల రజనీకి ఆరున్నర కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. రాజేష్ దాదాపు 20 కోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన్ని ఇంఛార్జ్‌గా తొలగించడంతో పెట్టిన డబ్బులన్నీ వృథా అయ్యాయి. వైసీపీ లిస్టులో ఫలానా నియోజకవర్గ ఇంఛార్జ్ అని పేరు ప్రకటించగానే.. ఆ అభ్యర్థి పార్టీ ఫండే కాదు.. ఫ్లెక్సీలు, కార్యకర్తల సమావేశాలు, ఇతరత్రా ఖర్చుల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.

కోట్లల్లో డబ్బులు వదిలించుకున్నాక.. మీకు టిక్కెట్ లేదని చెప్పడంతో చాలామంది ఇలా బాధితులుగా మారుతున్నారు. ఆర్థికంగా బలమైన వాళ్ళకి టిక్కెట్లు ఇస్తూ.. తీరా డబ్బులు ఖర్చుపెట్టాక ఇంఛార్జ్ నుంచి తీసేయడం కామన్ అయిందని వైసీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారాల్లో కోట్లల్లో చేతులు మారుతున్నా.. అఫీషియల్‌గా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అభ్యర్థులు. ఇప్పటిదాకా వైసీపీ లీడర్ రాజేష్ నాయుడు ఒక్కడే బయటపడ్డాడు. ఇలాంటి బాధితులు ఇంకా ఎందరో ఉన్నారని చెబుతున్నారు.