Rajya Sabha Elections : వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది వీరే..

దేశ వ్యాప్తంగా త్వరలో రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) జరుగున్న నేపథ్యంలో వైఎస్సార్ (YSRCP) రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ (CM Jagan) ఖరారు చేశారు.

దేశ వ్యాప్తంగా త్వరలో రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha elections) జరుగున్న నేపథ్యంలో వైఎస్సార్ (YSRCP) రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ (CM Jagan) ఖరారు చేశారు. టీటీడీ (TDP) మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి పేర్లను ఫైనలైజ్ చేశారు. అభ్యర్థుల పేర్లను వైసీపీ (YCP) అధికారికంగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy), గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి.. రాజ్యసభకు తమకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

వీరు ముగ్గురినీ ముఖ్యమంత్రి అభినందించారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన వారిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా… ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. తొలుత మూడో స్థానం కోసం ఆరని శ్రీనివాసులు పేరును జగన్ ఎంపిక చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన స్థానంలో మేడా రఘునాథరెడ్డి పేరును చేర్చడం జరిగింది. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్‌ జరుగనుంది.