YCP Social Empowerment Bus Yatra : నేటి నుంచి రెండో దశ సామాజిక సాధికార బస్సు యాత్రను మొదలు పెడుతున్న వైసీపీ..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ పార్టీ (YSR Party) ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వం ఎండగడుతూ.. వైసీపీ సామాజిక సాధికార (YCP Social Empowerment) బస్సు యాత్ర (Bus Yatra) నిర్వహించిన విషయం తెలిసిందే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ఆర్ పార్టీ (YSR Party) ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. గత ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ప్రభుత్వం ఎండగడుతూ.. వైసీపీ సామాజిక సాధికార (YCP Social Empowerment) బస్సు యాత్ర (Bus Yatra) నిర్వహించిన విషయం తెలిసిందే.. మొదటి సామాజిక సాధికార తొలి దశ బస్సు యాత్ర విజయవంతం చేశారు రాష్ట్ర మంత్రి వర్గం.. ఇప్పుడు అదే తరహాలో రెండో దశ బస్సు యాత్రకు సిద్ధం అవుతున్న వైసీపీ ప్రభుత్వం.

Telangana Elections : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. ఒక రోజు 5 నియోజకవర్గాల్లో రాహుల్ పర్యటన

ఇవాళ్టి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర రెండో దశ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రెండో దశ యాత్ర కొనసాగనుంది. తొలి దశ బస్సు యాత్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ లో సాగిన యాత్ర.. తరహాలోనే రెండో దశలో కూడా శ్రీకాకుళం జిల్లా, నరసన్న పేట, గుంటూరు, పొన్నూరు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. మొదటి దశ లో 35 నియోజకవర్గాలను టాచ్ చేస్తు సాగిన బస్సు యాత్ర.. ఈ సారి యాత్రలో మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగనుంది.