RRR WITH JAGAN : జగన్ని కెలికిన రఘురామ

ఏపీలో వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం పవర్ లో ఉంది. ప్రతిపక్ష నేత హోదా లేదు... అసెంబ్లీలో చివరి సీటు ఇచ్చారు.

 

 

ఏపీలో వైసీపీ ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం పవర్ లో ఉంది. ప్రతిపక్ష నేత హోదా లేదు… అసెంబ్లీలో చివరి సీటు ఇచ్చారు. ఇలా రకరకాల టెన్షన్లతో ప్రస్టేషన్ లో ఉన్న మాజీ సీఎం జగన్ ని కెలికారు రఘు రామరాజు. అది కూడా ఏపీ అసెంబ్లీ హాల్లో.. గవర్నర్ ప్రసంగాన్ని వాకౌట్ చేసి బయటకు వెళ్తున్న జగన్ ని పలకరించారు. ఏదో ఎదురు పడ్డారు కదా… మాట్లాడారేమో అనుకోవడం కాదు… మీరు అసెంబ్లీ నుంచి పారిపోవద్దు… కచ్చితంగా సమావేశాలకు రావాలని కూడా జగన్ని కోరారు రఘురామ.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాక… రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు నిరసనగా వైసీపీ వాకౌట్ చేసింది. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా బయటకు రాగానే… అసెంబ్లీ హాల్ లో కనిపించారు రఘురామ కృష్ణ రాజు. వెంటనే హాయ్ జగన్… అని పలకరించారు. దగ్గరకు వెళ్ళి… జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు రఘురామ. మీరు రోజు అసెంబ్లీకి రావాలి అని జగన్ అని కోరారు. అసెంబ్లీ నుంచి పారిపోవద్దు.. కచ్చితంగా రావాలని కూడా కోరారు. జగన్ కూడా వెంటనే రిప్లయ్ ఇచ్చారు. రెగ్యులర్ గా వస్తా…మీరే చూస్తారుగా అన్నాడు. రఘురామరాజు… జగన్ చేతిలో చెయ్యి వేసి మాట్లాడటం చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. ఇంతలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కనిపించగానే… తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని కోరారు RRR. తప్పని సరిగా అంటూ లాబీల్లోకి నవ్వుకుంటూ వెళ్ళి పోయారు కేశవ్. ఆ తర్వాత కొద్దిసేపు జగన్ తో మాట్లాడారు రఘురామ.

అసెంబ్లీకి రావడమే చాలా ఇబ్బందిగా ఫీలవుతున్న జగన్ ను కావాలని రఘురామ కెలికినట్టు అర్థమవుతోంది. వైసీపీ నేతల హత్యల పేరుతో… ఢిల్లీలో ధర్నాకు వెళ్తున్న జగన్… ఈసారి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. అది తెలిసే జగన్ పై సెటైర్లు వేశారు రఘురామ.
మరోవైపు… వైసీపీ హయాంలో సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టించిన మాజీ సీఎం జగన్ పై ఈమధ్యే హత్యాయత్నం కేసుపెట్టారు. ఆయనతో పాటు పోలీస్ అధికారులపై కేసు బుక్ అయింది. అది కూడా మనసులో పెట్టుకొనే… కావాలని జగన్ ని RRR పలకరించారని అంటున్నారు.