ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ( Daggubati Purandeshwari) పై సంచలన కామెంట్ చేసిన YCP రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి ( MP Vijaya Sai Reddy ) . గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా పురంధేశ్వరి – విజయసాయి రెడ్డి మధ్య మాటల యూద్దం సాగుతుంది.’పురందేశ్వరి పై ఏకంగా ఓ సంస్థ అమ్మకం విషయంలో పురంధేశ్వరి ముడుపులు తీసుకున్నారని’ విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు.దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ‘X’ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు విజయ్ సాయి రెడ్డి. ఏపీలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు చేసింది. పురందేశ్వరి తన కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజా కాదా అంటూ ప్రశ్నించారు.
Telangana BJP : నాలుగో జాబితాపై బీజేపీ కసరత్తు.. ప్రచారంలో వెనుకపడ్డ జాతీయ పార్టీలు..!
మొదట సొంత పార్టీ ( TDP ) టీడీపీ, తర్వాత ( BJP ) బీజేపీ, తర్వాత కాంగ్రెస్ .. మళ్లీ బీజేపీ ఇలా వరుసగా నాలుగు సార్లు పార్టీలు మార్చిన చరిత్ర పురందేశ్వరిది. ఎయిర్ ఇండియా ఇండిపెండెంగా డైరెక్టర్ గా కేంద్రంలో ఒక గౌరవమైన పదవిలో ఉండి..విమానయాన సంస్థ అమ్మకం విషయంలో పురందేశ్వరి మధ్యవర్తి వహించి ముడుపులు తీసుకొన్నది వాస్తవం కాదా..? పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టింది.
విజయ సాయి రెడ్డి పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు పురందేశ్వరి.. ఏపీలో వేలాది కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ లకొట్టే విధంగా చేశారని లేఖలో పేర్కొన్నారు పురందేశ్వరి.ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముందు నిధులు సమకూర్చి ఆ తర్వాత అప్రూవర్గా మారిన వారు విజయ సాయి రెడ్డి దగ్గరి బంధువులే అని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి. విశాఖపట్నం సమీపంలో భీమిలిలో రూ విజయ సాయి కూతురు, అల్లుడు కంపెనీల కోసం అనేక ఎకరాల విలువైన భూమిని అధికార దుర్వినియోగంతో తక్కువ ధరకు దాదాపు రూ. 177 కోట్లు భూములను విజయ సాయి రెడ్డి కుమార్తె కంపెనీ రూ. 57 కోట్లకే కొనుగోలు చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు పురందేశ్వరి.