AP Government : మీరు ఆయనలా చేయొచ్చుగా.. రేవంత్‌తో పోలుస్తూ చంద్రబాబును ఇరికించిన షర్మిల..

షర్మిల ఏం చేసినా సంచలనమే. ట్వీట్‌ కూడా హాట్‌హాట్‌గా మారుస్తుంటుంది రాజకీయాన్ని. వదిలేదే లే అన్నట్లు జగన్‌ను రాజకీయంగా వెంటాడుతున్న షర్మిల..

 

 

షర్మిల ఏం చేసినా సంచలనమే. ట్వీట్‌ కూడా హాట్‌హాట్‌గా మారుస్తుంటుంది రాజకీయాన్ని. వదిలేదే లే అన్నట్లు జగన్‌ను రాజకీయంగా వెంటాడుతున్న షర్మిల.. ఏపీలో కాంగ్రెస్‌ను స్ట్రాంగ్ చేసేందుకు తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐతే ఇప్పుడు రేవంత్‌తో పోలుస్తూ.. చంద్రబాబును ఇరికించారు షర్మిల. ఎన్నికల హామీ ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రైతు రుణాలను మాఫీ చేసింది. 2 లక్షల వరకూ ఉన్న పంట రుణాలను మాఫీ చేసింది. తొలి విడతలో లక్ష రూపాయల లోపు అప్పులను క్లియర్ చేస్తున్నారు. జులై నెలాఖరులోగా లక్షన్నర వరకూ ఉన్న పంట రుణాలను, ఆగస్ట్ 15లోగా రెండు లక్షల రూపాయల వరకూ రుణాలను మాఫీ చేస్తారు.

పంట రుణాల మాఫీని ఆధారంగా చేసుకుని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు షర్మిల. రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం గుప్పించారు. 15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాతపై ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంమని.. మళ్లీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో.. సోనియా, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా.. ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ.. కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అంటూ ట్వీట్ చేశారు షర్మిల. రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణం ఇదని.. తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు అని రాసుకొచ్చారు.

ఇదే ట్వీట్‌లో ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలోనూ రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తలసరి అప్పులో దేశంలోనే ఏపీ రైతులు మొదటి స్థానంలో ఉన్నారన్న షర్మిల.. వారికి ఎందుకు రుణమాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం సహకారం తీసుకుని ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రేవంత్‌ను పొగడడం సరే.. చంద్రబాబును ఇరికించేసిందిగా షర్మిల అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.