young voters in India: యువ ఓటర్ల హవా.. పెరిగిన యంగ్ ఓటర్ల శాతం.. దేశంలో మొత్తం ఓట్లు ఎన్నంటే..

18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుంది. 18-29 ఏళ్లలోపు ఓటర్లను యువ ఓటర్లుగా పరిగణిస్తారు. ఈ ఎన్నికల్లో 21.5 కోట్ల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా యువ ఓటర్ల తీర్పు చాలా కీలకం.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 02:53 PM IST

young voters in India: దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా దాదాపు సిద్ధమైంది. ఈ సారి యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఈసీ జాబితాలో తేలింది. ఫిబ్రవరి మొదటి వారం వరకు తీసుకున్న గణాంకాల ప్రకారం.. ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 21.5 కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుంది. 18-29 ఏళ్లలోపు ఓటర్లను యువ ఓటర్లుగా పరిగణిస్తారు. ఈ ఎన్నికల్లో 21.5 కోట్ల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

Raja Singh: ఏమన్నా ప్లాన్..? సికింద్రాబాద్‌పై రాజాసింగ్ కన్ను.. కిషన్ రెడ్డి సీటుకు ఎర్త్..!

గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఏ ఎన్నికల్లోనైనా యువ ఓటర్ల తీర్పు చాలా కీలకం. యాక్టివ్‌గా ఓట్లు వేసేది యువ ఓటర్లే. ఈసారి కూడా వీరి ఓట్లు కీలకం కాబోతున్నాయి. యువ ఓటర్లకు సంబంధించి అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్‌లో 33 శాతం, తర్వాత జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, ఝార్ఖండ్‌లలో 27 శాతం, తెలంగాణలో 22 శాతం, యూపీలో 21 శాతం, కర్ణాటకలో 20 శాతం, తమిళనాడులో 19 శాతం, కేరళలో 16.4 శాతం మంది ఓటర్లున్నారు. ఇక దాద్రా అండ్ నగర్ హవేలిలో అధికంగా 38 శాతం యంగ్ ఓటర్లున్నారు. ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వాళ్లు.. అంటే 18-19 ఏళ్లలోపు వారు దాద్రా అండ్ నగర్ హవేలిలో 7 శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 5 శాతం, మిజోరంలో 4 శాతం, జమ్ము కాశ్మీర్‌లో 3.9 శాతం మంది ఉన్నారు. అత్యధిక వృద్ధులు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 80 ఏళ్లు పైబడిన వాళ్లు 26 లక్షల మంది ఉంటే, వందేళ్లు పైబడిన వాళ్లు 56,800 మంది ఓటర్లున్నారు.

యూపీలో 80 ఏళ్లుదాటిన వాళ్లు 24.2 లక్షల మంది, వందేళ్లు దాటిన వాళ్లు 32,800 మంది ఉండగా, బిహార్, రాజస్థాన్‌లో వందేళ్లు దాటిన ఓటర్లు 20 వేలకుపైగా ఉన్నారు. దక్షిణ భారత్‌తోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉంది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, గోవా, ఏపీల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌లలో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది.

ఓటర్ల జాబితాకు సంబంధించిన తాజా లెక్కలివి..
మొత్తం ఓటర్ల సంఖ్య: 96,88,21,926
పురుష ఓటర్లు: 49,72,31,994
మహిళా ఓటర్లు: 47,15,41,888
ట్రాన్స్‌జెండర్లు: 48,044