YS JAGAN: ఏపీ సీఎం జగన్ సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం ఏడుపులపాయ నుంచి పులివెందుల చేరుకున్న జగన్.. స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకల్లో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. చాలా కాలం తర్వాత సీఎం జగన్.. తన తల్లితో కలిసి హాజరయ్యారు.
Gannavaram Airport: హైదరాబాద్ విమానాలు గన్నవరం మళ్లింపు.. మూడు విమానాలు ల్యాండింగ్..
జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. దీంతో ఇద్దరూ ఒకే చోట కలిసి కనిపించడం, వేడుకల్లో పాల్గొనడం అభిమానులకు ఆసక్తికరంగా అనిపించింది. ఇద్దరూ కలిసి చర్చిలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జగన్.. కేక్ కట్ చేసి, తల్లి విజయమ్మకు తినిపించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిసహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం జగన్ మూడు రోజుల కడప పర్యటనలో ఉన్నారు. ఆదివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు.
క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలే తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ప్రార్థించారు సీఎం జగన్. అనంతరం 2024 నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఏపీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ప్రజల దగ్గరి నుంచి అర్జీలు స్వీకరించారు.