YS JAGAN: బాబాయ్‌ను చంపిన వారికి చంద్రబాబు మద్దతు.. నేను ప్రజల పక్షం: వైఎస్ జగన్

వివేకా చిన్నాన్నను అన్యాయంగా చంపారు. చిన్నాన్నను చంపి.. ఆ హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడిని, జైల్లో ఉండాల్సినోడిని నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు.

  • Written By:
  • Updated On - March 27, 2024 / 09:33 PM IST

YS JAGAN: తన బాబాయ్ వివేకాను చంపిన హంతకులు బయట తిరుగుతున్నారని, వారిని చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నారని విమర్శించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా పొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “బాబాయ్‌ను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ఆ దేవుడికి, కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసు.

Kavitha Tihar Jail: కవిత జైల్లో మొదటి రోజు.. ఎలా గడిచిందంటే..!

వివేకా చిన్నాన్నను అన్యాయంగా చంపారు. చిన్నాన్నను చంపి.. ఆ హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి ఎవరు మద్దతిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడిని, జైల్లో ఉండాల్సినోడిని నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, ఆయనకు సంబంధించిన వారే. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు. నన్ను దెబ్బతీసే రాజకీయం చేస్తున్నారు. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్నది నీచ రాజకీయం. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నా. ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేసే వ్యక్తి చంద్రబాబు. శవరాజకీయాలు, కుట్రలు ఆయనకు అలవాటు. ఈ కుట్రలు చాలవన్నట్లు.. నా చెల్లెలిద్దరిని తీసుకొచ్చుకున్నారు. పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు.. పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా..? మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా..?

వైఎస్సార్‌ జిల్లా నేలమీద.. ఈ పొద్దుటూరు గడ్డమీద.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేస్తున్నాం. రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచింది ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా. ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది. రాష్ట్రంలో ఎ‍క్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి” అని జగన్ వ్యాఖ్యానించారు.