YS JAGAN: ఇటువైపు నేనొక్కడినే.. అటువైపు తోడేళ్ల గుంపు: జగన్

ఎన్నికల యుద్ధంలో ఇటువైపు నేను ఒక్కడినే. అటువైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ కూడా తోడయ్యింది. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం.

  • Written By:
  • Updated On - March 28, 2024 / 08:19 PM IST

YS JAGAN: తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నానని.. తనను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయన్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. “నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోంది. ఎన్నికల యుద్ధంలో ఇటువైపు నేను ఒక్కడినే. అటువైపు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ కూడా తోడయ్యింది. జగన్‌ను ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు. కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం.

K Keshava Rao: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు సాధించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబుల్ సెంచరీ కొట్టేలా ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈ ఎన్నికలు మనకు జైత్రయాత్ర. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మూడు రాజధానులు, కొత్తగా రాష్ట్రంలో మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఐదేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాం. 2 లక్షల 77వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. 22 లక్షల ఇళ్లు నిర్మించాం. 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. నష్టపోయిన రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడి అందించాం. చంద్రబాబు14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చేసినన్ని అభివృద్ది పనులు ఎందుకు చేయలేకపోయారు. ఐదేళ్లలో గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి. వైసీపీ ఐదేళ్ల పాలనపై అందరితోనూ చర్చించండి. 2019లో ఇచ్చిన ఎన్నికల హామీలు 99 శాతం అమలు చేశాం.

చంద్రబాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? చంద్రబాబు పేరు చెప్తే కరువు గుర్తుకొస్తుంది. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు గుర్తుకొస్తాయి. చంద్రబాబు అండ్‌కో పని దోచుకోవడం, పంచుకోవడమే. మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు అభివృద్ధి ఎందుకు చేయలేదు? మళ్లీ మరోసారి మోసం చేసేందుకు బాబు అండ్‌కో వస్తుంది. జాగ్రత్త” అంటూ జగన్ వ్యాఖ్యానించారు.