YS JAGAN: తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే.. చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడను: జగన్

మోసం చేసే చంద్రబాబు కూటమితో తలపడుతున్నాం. చేయలేని వాగ్ధానాలను చెప్పి.. జగన్ అనే వ్యక్తి మోసం చేయడు. చంద్రబాబు చెప్పే అబద్ధాలతో నేను పోటీ పడాలనుకోవటం లేదు. నోటికి ఏది వస్తే అది చెప్పడమే చంద్రబాబు ధోరణి.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 08:03 PM IST

YS JAGAN: జూన్ 4న మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందన్నారు ఏపీ సీఎం జగన్. తిరుపతి జిల్లాలో గురువారం జరిగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర, బహిరంగ సభల్లో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు చేశారు. “పొత్తులు, ఎత్తులు, జిత్తులతో నాకు పని లేదు. ఎవర్నీ మోసం చేయడంలేదు. ప్రతి ఇంటికి మంచి చేశాం.

Vijayashanti: రాములమ్మ ఎక్కడ..? పొలిటికల్‌ సీన్‌లో కనిపించని విజయశాంతి.. పట్టించుకోని కాంగ్రెస్..

అందుకే ఓట్లడుగుతున్నాం. మోసం చేసే చంద్రబాబు కూటమితో తలపడుతున్నాం. చేయలేని వాగ్ధానాలను చెప్పి.. జగన్ అనే వ్యక్తి మోసం చేయడు. చంద్రబాబు చెప్పే అబద్ధాలతో నేను పోటీ పడాలనుకోవటం లేదు. నోటికి ఏది వస్తే అది చెప్పడమే చంద్రబాబు విధానం. జూన్ 4 వరకూ ఓపిక పట్టండి. మళ్లీ మీ అందరి ప్రభుత్వం రాబోతుంది. అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తా. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చంద్రబాబు కిచిడి మెనిఫెస్టోతో పోటీపడలేను. అబద్ధాలను నేను చెప్పలేను. ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతున్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలో నిర్ణయించుకోండి. తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా తాతలు ప్రాణాలు కోల్పోయారు. మనం మెనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాం. ఇంత మంచిని చేసిన నేను మీ ముందుకు వచ్చా. ఈ ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ.

మనకు కోట్ల మంది అభిమానం ఉంటే.. ఎల్లో ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. 2014లో కూటమిగా ఏర్పడి మోదీ, పవన్‌ను తెచ్చుకున్నారు చంద్రబాబు. ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికి పంపించారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మాదిరిగా రైతు రుణమాఫీ చేశాడా..? ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా..? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తామని చెప్పాడు. అలా కుదరపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నాడు. వీటిని అమలు చేశాడా అని అడుగుతున్నా.” అంటూ జగన్ వ్యాఖ్యానించారు.