YS JAGAN: లంచాలు లేకుండా సంక్షేమం అందిస్తున్నాం.. కూటమి కుట్రలను అడ్డుకోవాలి: జగన్

లంచాలు, వివక్ష లేకుండా ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లుపేదల ఖాతాల్లో వేశాం. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారు. దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి.

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 09:24 PM IST

YS JAGAN: తన పాలనలో లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాల్ని అందిస్తున్నానని చెప్పారు ఏపీ సీఎం జగన్. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. “లంచాలు, వివక్ష లేకుండా ఐదేళ్లలో రూ.2.70 లక్షల కోట్లుపేదల ఖాతాల్లో వేశాం. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారు. దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా?

Devara: కళ్లు చెదిరేలా.. దేవర బిజినెస్.. అయినా కానీ..

పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. చంద్రబాబు పేరు చెబితే.. పేదలకు గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా? చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ. నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతో వచ్చాయి. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది కుట్ర, మోసం, వెన్నుపోటు. చంద్రబాబుకు, అభివృద్ధికి అసలు సంబంధమే లేదు. విపక్షాలు విసిరే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? ప్రజలకు తగులుతున్నాయా? చెప్పాలి. ఇదిగో మైక్రోసాఫ్ట్‌, అదిగో సింగపూర్‌ అంటూ చంద్రబాబు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు. బాబు వస్తే జాబ్‌లు రావడం కాదు.. ఉన్నవి కూడా ఊగిపోతాయి. ఇన్ని అబద్ధాల తర్వాత చంద్రబాబు సింగపూర్‌ కట్టాడా?బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చిందా? ఒలింపిక్స్‌ జరిగాయా? బాబు, బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తింటూ మరోవైపు జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకని బాబును అడిగా. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేశాడు.

దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా? ఏం మనిషివయ్యా నువ్వూ అని అడిగా.. అందుకే దత్తపుత్రుడిలో ఈ మధ్య బీపీ బాగా కనిపిస్తుంది. ఇలా అడిగినందుకు బాబుకు, దత్తపుత్రికిడి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తుంది. 2014లో కూడా కూటమి నేతలు మేనిఫెస్టో ఇంటింటికీ పంపి హామీలను గాలికొదిలారు. మీ బిడ్డకు రైతన్న, అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు” అని జగన్ వ్యాఖ్యానించారు.