YS JAGAN: నేను మంచి చెయ్యకపోతే ప్రజలే ఓడిస్తారు.. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చేది వెన్నుపోటే: జగన్

ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదు. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూలోటు వెంటాడుతోంది.

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 07:45 PM IST

YS JAGAN: తాను మంచి చెయ్యకపోతే ప్రజలే ఓడిస్తారని, ప్రతిపక్షాలంతా ఎందుకు ఏకమవుతున్నాయని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోటే అన్నారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం గవర్నర్ ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంపై జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. “గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి. ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదు.

REVANTH REDDY VS KCR: దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్

పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూలోటు వెంటాడుతోంది. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ ఉండాలి. అలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు. అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నా. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం. ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి. 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమేనన్నారు. 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసినా మనకు 31 శాతం మాత్రమే దక్కింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా 2023-23లో 38,000 కోట్లకు చేరుకుంది. కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఐదేళ్లు పాలించామం. ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన అందించాం. రూ.2లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం.

దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ. జగన్‌ కేవలం బటన్‌లు మాత్రమే నొక్కుతూంటారన్నది కూడా అబద్ధం. చంద్రబాబు హయాంలో ఏ కుటుంబానికి మంచి జరగలేదు. ఆయన హయంలో సంక్షేమ పథకాలు లేవు. మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చేసి చూపించాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం. 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రానికి ప్రజలకు పనికిరాని అనుభవం ఎందుకు..? చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో గారడీ చేస్తున్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చేది వెన్నుపోటే. ఇప్పటికీ చంద్రబాబు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారు. ఇన్ని కుట్రలు, పొత్తులు, కుతంత్రాలు ఎందుకు. ప్రజలకు మంచి చెయ్యకపోతే వాళ్లే ఓడిస్తారు. ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయి” అని జగన్ వ్యాఖ్యానించారు.