PITHAPURAM: పిఠాపురంలో పవన్ ఓటమికి.. వైసీపీ త్రికోణ వ్యూహం

ఏపీలో పిఠాపురం అసెంబ్లీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది వైసీపీ. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తుండటంతో.. ఆ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 11:08 AM IST

PITHAPURAM: ఆంధప్రదేశ్‌లో వైసీపీకి టార్గెట్ 175 ఎంత ఇంపార్టెంటో.. పిఠాపురం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదీ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మనసులోని మాట. పవన్ పోటీ చేస్తుండటంతో.. పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. వంగా గీత, ముద్రగడతో ప్రత్యేకంగా భేటీ అయిన జగన్.. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. త్రికోణ వ్యూహంతో పవన్ కల్యాణ్ ని ఓడించడానికి వైసీపీ ప్లాన్ రెడీ చేస్తోంది.

World Happiness Report: వరల్డ్ హ్యాపీనెస్ డే.. సంతోషంలో మన స్థానమెక్కడ..? ఇంత దారుణమా..?
ఏపీలో పిఠాపురం అసెంబ్లీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది వైసీపీ. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తుండటంతో.. ఆ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. పిఠాపురంలో పవన్‌ను అష్టదిగ్భంధనం చేసేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా ప్లాన్‌ చేస్తోంది. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 30 వేల ఓట్లు ఉన్నాయి. అందులో కాపులవి 95వేలు. తర్వాత స్థానంలో బీసీలు దాదాపు 85వేల మంది ఉన్నారు. పిఠాపురంలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి పట్టుదలతో ఉన్న జగన్.. వంగా గీతను బరిలోకి దింపారు. అయితే.. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్‌ కూటమి నుంచి పోటీ ఉండటంతో.. అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో వంగా గీత, ముద్రగడ పద్మనాభంతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ముద్రగడ, ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చించారు. పిఠాపురంలో పవన్‌కు ఎలా చెక్‌ పెట్టాలా అనే అంశంపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్టానం.. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన శేషుకుమారిని ఇప్పటికే పార్టీలో చేర్చుకుంది. తాజాగా.. పిఠాపురం జనసేన నేతలు వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో ప్రతీ ఓటూ కీలకం కావడంతో.. పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌పై అధికార పార్టీ దృష్టి పెట్టింది. నియోజకవర్గంలో వరుస సభలు, సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది. కాపులతో పాటు.. పద్మశాలీలు, శెట్టిబలిజ, మత్యకారులు, ఎస్సీ ఓట్లు కీలకం కావడంతో.. సోషల్ ఇంజనీరింగ్‌పైనా వైసీపీ దృష్టిపెడుతోంది.

వివిధ సామాజికవర్గాల వారికి ప్రభుత్వం ఏం చేసిందో వరుస సభల్లో వివరించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఒక్కో ఫ్యామిలీకి ఎంత లబ్ధి కలిగిందో లెక్కలేసి మరీ చెప్పాలని భావిస్తోంది. మొత్తంగా పిఠాపురంలో పవన్‌ను అష్టదిగ్భంధనం చేసేందుకు పక్కాగా వ్యూహాలను అమలు చేసేందుకు సిద్దమైంది వైసీపీ.