YS JAGAN: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఇకపై పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. మార్చి 27 నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని సిద్ధం పేరుతో జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్ధం సభలు ముగియడంతో ఇప్పుడు బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.
Baba Ramdev: పతంజలి యాడ్స్.. బాబా రాందేవ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా, మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. సిద్ధం సభలు నాలుగు చోట్ల జరిగినందున ఆ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ సభలు జరుగుతాయి. ఈ సందర్భంగా బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను సజ్జల వివరించారు. సజ్జల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ బస్సు యాత్ర ప్రారంభానికి ముందు.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌ను జగన్ సందర్శిస్తారు. అక్కడ వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్ర మొదలుపెడతారు. మొదట.. పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ బస్సు యాత్ర ఉంటుంది.
మొదటి మూడు రోజుల షెడ్యూల్ ఇది
♦ మార్చి 27న ఇడుపులపాయ నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం
♦ ముందుగా ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
♦ ఉదయం కార్యకర్తలతో ఇంటరాక్షన్, సాయంత్రం బహిరంగ సభలు
♦ 27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ
♦ 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ
♦ 30న ఎమ్మిగనూరులో సీఎం జగన్ బహిరంగ సభ