YS JAGAN: జగన్ పర్యటనలో చెప్పు విసిరిన వ్యక్తి.. నీళ్ల కోసం నిలదీసిన జనం..

ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో శనివారం జరిగింది. జగన్‌పై విసిరిని చెప్పు దూరంగా పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. వైసీపీ నేతలు, అభిమానులు కూడా షాకయ్యారు.

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 09:21 PM IST

YS JAGAN: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కలకలం రేగింది. కర్నూలు జిల్లా పర్యటను ముగించుకుని, అనంతపురం జిల్లాలో జగన్ బస్సుపై పర్యటిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో శనివారం జరిగింది. జగన్‌పై విసిరిని చెప్పు దూరంగా పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు.

MLC KAVITHA: ఇంటి భోజనం ఇప్పించండి.. కోర్టులో కవిత పిటిషన్..

వైసీపీ నేతలు, అభిమానులు కూడా షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు.. జగన్ యాత్రలో మహిళలు నీళ్ల కోసం నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు జగన్ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందే అప్రమత్తమై మహిళల వద్ద నుంచి ఖాళీ బిందెలను స్వాధీనం చేసుకున్నారు. అయినా సరే మహిళలు.. జగన్ బస్సు రాగానే వాహనాన్ని అడ్డుకున్నారు. ఇది గమనించిన జగన్.. బస్సు దిగి మహిళల వద్దకు వచ్చారు. మహిళలతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. తాము కొంతకాలంగా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన నాయకుడు లేక గ్రామంలోని చెరువు నింపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన జగన్.. కొందరు మహిళలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పి వెళ్లి పోయారు. అయితే, జగన్ కనీసం స్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.