YS JAGAN: మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా.. విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న ఏపీ సీఎం జగన్‌పై రాయి దాడి జరిగింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య జరిగిన యుద్ధం అంతా ఇంతా కాదు. రాయి దాడి తర్వాత జగన్ నుదుడిపై గాయం అయింది. ఆయనపై రాయి దాడి జరిగి.. దాదాపు రెండు వారాలు అవుతోంది. ఆ దాడి తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్లు.. జగన్ తలకు బ్యాండేజ్ కట్టారు. నుదుటిపై రెండు కుట్లు కూడా వేశారనే చర్చ జరిగింది.
Sahithi Dasari: ఎన్నికల బరిలో హీరోయిన్.. చేవెళ్ల ఎంపీ బరిలో పొలిమేర నటి
ఆ తర్వాత నుంచి ప్రతీ సభలో బ్యాండేజీతోనే కనిపించారు జగన్. ఆ బ్యాండేజ్‌తోనే మేమంతా సిద్ధం రోడ్ షోలు, సభల్లో పాల్గొన్నారు. ఐతే ఆ తర్వాత బ్యాండేజీ మీద కూడా విపక్షాల సెటైర్లు వినిపించాయ్. దెబ్బ తగిలి రెండు వారాలు అవుతున్నా.. బ్యాండేజ్ ఇంకా ఎందుకు అంటూ విమర్శలు గుప్పించారు కొందరు. ఐతే వైసీపీ మ్యానిఫెస్టో విడుదల సమయంలో.. జగన్ బ్యాండేజ్ తీసేసి కనిపిస్తున్నారు. ఓ దశలో జగన్ సోదరి.. డాక్టర్ సునీతారెడ్డి కూడా బ్యాండేజ్ తీసేయాలని సూచించారు. ఇన్ని రోజులు బ్యాండేజ్ ఉంచుకుంటే సెప్టిక్ అవుతుందని అన్నారు. దీనిపైనా స్పందించని జగన్.. సడెన్‌గా బ్యాండేజ్ తీసేసి కనిపించారు. ఐతే దీన్ని కూడా విపక్షాలు ఆయుధంగా మార్చుకుంటున్నాయ్.
నుదుటిపై గాయం ఉన్నట్లు కానీ, కుట్ల తాలూకు ఆనవాళ్లు కానీ కనిపించడం లేదని.. రాయి దాడి ఒక డ్రామా అంటూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నాయ్. నిజానికి ఆ వీడియాలో.. జగన్ నుదుటి మీద ఎలాంటి గాయం తాలుకు ఆనవాళ్లు కనిపించ లేదు. దీంతో గుర్తులు ఏవి అంటూ కొత్త చర్చ మొదలైంది. గులకరాయి దెబ్బ డ్రామా అని ముందు నుంచి చెప్తున్న దానికి ఇదే సాక్ష్యం అని.. ఓట్ల కోసం మరీ ఇంతలా దిగజారుతారా అంటూ విపక్ష నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.