YS JAGAN: వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయా..? కుటుంబం మొత్తం ఒకవైపు ఉంటే.. జగన్ మాత్రం మరోవైపు ఉన్నారా..? చెల్లి షర్మిలతో పాటు తల్లి విజమ్మను కూడా జగన్ లైట్ తీసుకున్నారా..? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే వైసీపీ కార్యకర్తల్లో కలుగుతున్న అనుమానాలు ఇవే. షర్మిల తెలంగాణలో రాజకీయం చేసినన్ని రోజులూ పరిస్థితి బాగానే ఉండేది. అన్నాచెల్లెళ్ల మధ్య రిలేషన్ అంత గొప్పగా లేకుండా.. విజయమ్మ మాత్రం తెలంగాణలో కూతురికి ఆంధ్రాలో కొడుక్కి సపోర్ట్ చేస్తూ ఉండేది.
CM Revanth Reddy: మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తారా.. కాపలాగా నేనున్నా: రేవంత్ రెడ్డి
కానీ షర్మిల ఏపీకి షిఫ్ట్ ఐన తరువాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా విజయమ్మ ఎవరో ఒకరికి మాత్రమే ససోర్ట్ చేయాలి. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిపోయింది విజయమ్మ పరిస్థితి. ఈ కారనంగానే ఆమె విదేశాలకు వెళ్లిపోయారు అనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు జగన్ కూడా తన తల్లిని లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కొంత కాలంగా తన తల్లి పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడమే కాకుండా విజయమ్మ పుట్టినరోజు కూడా చాలా సింపుల్‌గా రియాక్ట్ అయ్యారు జగన్. ట్విటర్‌లో తల్లి ఫొటోపెట్టి హ్యాపీ బర్త్ అమ్మ అంటూ సింపుల్‌గా రాశారు. అది కూడా షర్మిల ట్విటర్‌లో పోస్ట్ పెట్టిన చాలా సేపటికి జగన్ తాను కూడా పోస్ట్ చేశారు. షర్మిల మాత్రం తన తల్లిని ఆకశానికెత్తుతూ విజయమ్మ కోసం పెద్ద కవితే రాసింది. కానీ జగన్ మాత్రం ఏదో పక్కింటివాళ్లకు చెప్పినంత సింపుల్‌గా బర్త్‌డే విషెస్ పోస్ట్ చేశారు.
దీంతో వీళ్లద్దరి మధ్య గ్యాప్ ఇంకా పెరిగింది అనే అనుమానాలు వైసీపీ కార్యకర్తల్లో కలుగుతున్నాయి. జగన్ బస్సు యాత్ర సమయంలో విజయమ్మ జగన్‌తో ప్రార్థనలు చేశారు. శర్మిల ఏపీ అధ్యక్షురాలు అయినప్పుడు షర్మిలతో గెలుపుకోసం కూడా ప్రార్థనలు చేశారు. ఇద్దరిలో ఆమె ఎవరిపు ఉంటారు అని అంతా అనుకుంటున్న సమయంలో.. విజయమ్మ బర్త్ డే రోజు జగన్ ఇంత సింపుల్‌గా రియాక్ట్ అవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. షర్మిలను లైట్ తీసుకున్నట్టుగానే తన తల్లిని కూడా జగన్ లైట్ తీసుకున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.