YS JAGAN: పులివెందుల ప్రచారంలో భారతి.. షర్మిలకు బదులిచ్చేందుకేనా..?

వైఎస్ వివేకా హత్య విషయాన్ని షర్మిల లేవనెత్తుతూ సోదరుడు జగన్, అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల ప్రశ్నలకు వైసీపీ నుంచి ధీటైన స్పందన రావడం లేదు. దీంతో షర్మిల, సునీతను ఎదుర్కోవాలంటే భారతిని ప్రచారంలోకి తేవడమే మంచిదని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 09:22 PM IST

YS JAGAN: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. జగన్‌కు టీడీపీ కూటమి నుంచే కాకుండా చెల్లెళ‌్లు షర్మిల, సునీత నుంచి కూడా పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కడప నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. దీంతో కడపలో వైఎస్ కుటుంబం మధ్యే పోటీ ఉంది. వైఎస్ వివేకా హత్య విషయాన్ని షర్మిల లేవనెత్తుతూ సోదరుడు జగన్, అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షర్మిల ప్రశ్నలకు వైసీపీ నుంచి ధీటైన స్పందన రావడం లేదు.

SS Rajamouli: వాట్ ఏ జోడీ.. రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్‌ వార్నర్‌..!

షర్మిలను వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా ఎంత కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. ఈ విషయంలో మాత్రం షర్మిలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో వివేకా హత్య అంశం రాజకీయంగా ఇబ్బందిగా మారుతుండటంతో జగన్ కుటుంబం తరఫున ఆయన భార్య భారతి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా షర్మిల.. కడప, పులివెందులలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. వివేకా కూతురు సునీత.. సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. వివేకా హంతకులకు జగన్ అండగా ఉన్నారని విమర్శిస్తున్నారు. దీంతో షర్మిల, సునీతను ఎదుర్కోవాలంటే భారతిని ప్రచారంలోకి తేవడమే మంచిదని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. షర్మిల, సునీతను ఎదుర్కోవాలంటే భారతి మాత్రమే సరైన వ్యక్తి అని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే భారతి.. పులివెందుల, కడపలో ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఏపీలో వచ్చే వారం నుంచి నామినేషన్ల పర్వం మొదలుకానుంది.

జగన్ నామినేషన్ వేసిన తర్వాత నుంచి పులివెందులలో భారతి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. ఎన్నికలు ముగిసే వరకు ఆమె పూర్తిగా ప్రజల్లోనే ఉండనున్నారు. ఎప్పుడు, ఎక్కడ సభలు, ర్యాలీలు నిర్వహించాలి అనే అంశాలను కూడా ఆమే పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పులివెందులలోని పార్టీ పెద్దల సహకారంతో ఆమె పార్టీ ప్రచారాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భారతి కూడా వివేకా హత్య విషయంలో షర్మిల, సునీతకు గట్టి కౌంటర్లు ఇస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. తమపై వాళ్లిద్దరూ చేస్తున్న ఆరోపణలతో కలుగుతున్న డ్యామేజిని భారతి అడ్డుకుంటారని ఆ పార్టీ వర్గాల అభిప్రాయం.