YS SHARMILA: షర్మిల కాన్వాయ్ అడ్డగింత.. చెల్లిని చూసి జగన్ భయపడుతున్నారా..?

కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాగా.. అక్కడి నుంచి స్పెషల్‌ కాన్వాయ్‌లో ఏపీ కాంగ్రెస్ ఆఫీస్‌కు స్టార్ట్ అయ్యారు. ఐతే ఎనికేపాడు దగ్గరకు కాన్వాయ్ రాగానే.. పోలీసులు వాటిని దారి మళ్లించారు.

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 01:58 PM IST

YS SHARMILA: ఏపీ రాజకీయంలో ఇప్పుడు షర్మిల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న షర్మిలకు.. ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమె ప్రయణిస్తున్న కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎనికేపాడు దగ్గర కాంగ్రెస్ పార్టీ ర్యాలీగా వెళ్తున్న వాహనాలను దారి మళ్లించారు. తమ వాహనాలను డైవర్ట్ చేసినందుకు నిరసనగా.. కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీతో పాటు ఇతర శ్రేణులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

AYODHYA RAM MANDIR: రాముడు ఎందుకు మహనీయుడు..? ఈ దేశానికి ఎందుకంత ప్రేమ..?

కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాగా.. అక్కడి నుంచి స్పెషల్‌ కాన్వాయ్‌లో ఏపీ కాంగ్రెస్ ఆఫీస్‌కు స్టార్ట్ అయ్యారు. ఐతే ఎనికేపాడు దగ్గరకు కాన్వాయ్ రాగానే.. పోలీసులు వాటిని దారి మళ్లించారు. దీంతో ప్రభుత్వం తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే తన కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఘాటు విమర్శలు చేశారు. భయపడుతున్నారా సార్ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. షర్మిల రాకతో.. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు బౌన్స్‌బ్యాక్ అవుతుందా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా.. అది వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. జగన్‌తో తాడోపేడో తేల్చుకోవడమే లక్ష్యం అన్నట్లుగా షర్మిల తీరు కనిపిస్తోంది. ఓ అన్నగా మర్యాద కోసం.. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు పిలిచారే తప్ప.. జగన్‌తో అనుబంధం ఎప్పుడో తెగిపోయింది అనే రీతిలో.. రాజారెడ్డి నిశ్చితార్థంలో షర్మిల వ్యవహరించారు.

దీనిపై జనాల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఇప్పుడు షర్మిల కాన్వాయ్‌ను దారి మళ్లించడంతో ఆ మంట మరింత రేగినట్లు కనిపిస్తోంది. షర్మిల ఎంట్రీతో.. వైఎస్ ఫ్యామిలీ సానుభూతి ఓటర్లు.. కాంగ్రెస్ వైపు అంతో ఇంతో చూసే అవకాశం ఉంటుందని.. ఈ పరిస్థితి రావొద్దనే.. జగన్ సర్కార్ ఇలాంటి ఎత్తులు వేస్తుందని సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఇంకొందరయితే.. షర్మిల డైలాగును తమ మాడ్యులేషన్‌లో చెప్తున్నారు. చెల్లిని చూసి భయపడుతున్నావా జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏమైనా ఏపీ రాజకీయం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.