YS SHARMILA: రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడా.. జగన్ ఒక్క హమీ అయినా నెరవేర్చాడా: వైఎస్ షర్మిల

జగన్ పాలనలో అభివృద్ధి కనిపిస్తుందా..? వైఎస్సార్ వదిలేసిన ఒక్క ప్రాజెక్టునూ జగన్ పూర్తి చేయలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వైఎస్సార్ కల. జగన్ మాత్రం స్టీల్‌ప్లాంట్ పూర్తి చేయకుండా.. కడప వెళ్లినప్పుడల్లా శంకుస్థాపన చేసి వస్తాడు. ఒకే ప్రాజెక్టుకు పదేపదే శంకుస్థాపన చేస్తాడు.

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 05:18 PM IST

YS SHARMILA: వైఎస్ జగన్ ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చాడా అని ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయనున్న షర్మిల.. అక్కడి పెండ్లిమర్రిలో జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తన అనన జగన్‌పై విమర్శలు గుప్పించారు. “జగన్ పాలనలో అభివృద్ధి కనిపిస్తుందా..? వైఎస్సార్ వదిలేసిన ఒక్క ప్రాజెక్టునూ జగన్ పూర్తి చేయలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వైఎస్సార్ కల. జగన్ మాత్రం స్టీల్‌ప్లాంట్ పూర్తి చేయకుండా.. కడప వెళ్లినప్పుడల్లా శంకుస్థాపన చేసి వస్తాడు. ఒకే ప్రాజెక్టుకు పదేపదే శంకుస్థాపన చేస్తాడు.

Raghu Rama Krishna Raju: టీడీపీకి తలనొప్పిగా మారిన రఘురామ.. టిక్కెట్ ఇస్తారా.. లేదా..?

జగన్.. ఈ ప్రాజెక్టును శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చాడు. అవినాష్ అనుచరులు భూముల కోసం చంపేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేదు. రాజధాని లేదు. ఉద్యోగాలు లేవు. కానీ, జగన్ ఒక్క రోజు కూడా వీటిపై కేంద్రాన్ని అడగడు. స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టుపెట్టాడు. రైతుల కోసం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. రైతు నష్టానికి పంటను అమ్ముకోకూడదన్నాడు. రైతులకు లాభాలు రావాలి తప్ప అప్పులపాలు కాకూడదన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడా..? ఏపీలో ఎక్కడ చూసినా వైన్.. మైన్.. ల్యాండ్.. శ్యాండ్.. మాత్రమే కనిపిస్తోంది. కుంభకర్ణుడైనా ఆర్నెళ్లకు నిద్రలేస్తాడు. కానీ, జగన్ నాలుగున్నరేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయాడు. 23 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తానన్న జగన్.. ఇప్పుడు 6 వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారు. ఒక్కవర్గాన్నైనా జగన్ పట్టించుకున్నారా..? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మిగిలిన వారిని వైసీపీ నాయకులు చంపేస్తున్నారు. వివేకా హత్య జరిగి ఐదేళ్లైనా న్యాయం జరగలేదు. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు యథేచ్చగా బయట తిరుగుతున్నారు. వివేకా హంతకులకే టిక్కెట్ జగన్ ఇస్తారా..? హంతకుల్ని జగన్ కాపాడుతున్నాడు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే నేను పోటీ చేస్తున్నా. వైఎస్సార్ బిడ్డకు.. వివేకా హంతకులకు మధ్య పోటీ. ఎటువైపు ఉండాలో ప్రజలు నిర్ణయించుకోవాలి” అని షర్మిల వ్యాఖ్యానించారు.