YS SHARMILA: వివేకాను చంపిన వారికే జగన్ టిక్కెట్.. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే పోటీ: షర్మిల

ధర్మం కోసం ఒకవైపు నేనుంటే.. డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారు. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - April 5, 2024 / 02:32 PM IST

YS SHARMILA: తన బాబాయ్ వైఎస్ వివేకాను చంపిన వారికే జగన్ మళ్లీ టిక్కెట్ ఇచ్చారని, హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే తాను పోటీ చేస్తున్నానన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. శుక్రవారం కడప జిల్లాలో షర్మిల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “కడప లోక్‌సభ ఎన్నికల్లో ఓ వైపు మీ రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారు.

ALI YSRCP: వైసీపీ ప్రచారానికి అలీ డుమ్మా ! అసలేం జరిగింది ?

ధర్మం కోసం ఒకవైపు నేనుంటే.. డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారు. ఎవరిని గెలిపించాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. హంతకులను కాపాడేందుకు అధికారాన్ని వాడుతున్నారు. ఇది దుర్మార్గం కాదా? వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్‌ను ఓడించాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారు. ప్రజల భవిష్యత్ బావుండాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి.

ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉంటే అన్నీ పూర్తయ్యేవి. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ వంటి ఎన్నో పథకాలు అమలు చేశారు” అని షర్మిల వ్యాఖ్యానించారు.