YS SHARMILA: భద్రత కల్పించండి.. ఏపీ డీజీపీకి షర్మిల లేఖ

ప్రస్తుతం షర్మిలకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు. అయితే, తనకు ఫోర్‌ ప్లస్‌ ఫోర్‌ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్‌ ఎస్కార్‌ వెహికల్‌ కేటాయించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 07:08 PM IST

YS SHARMILA: ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంతోపాటు టీడీపీ, మోడీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. రోజుకో వ్యవహారం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై మోదీకి మంగళవారం లేఖ రాసిన షర్మిల.. బుధవారం తన భద్రత గురించి, ఏపీ డీజీపీకి లేఖ రాశారు. తనకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతను పెంచాలని లేఖలో కోరారు.

KUMARI AUNTY: లివర్‌ కర్రీ సీక్రెట్‌ ఏంటి..? కుమారి ఆంటీ హోటల్‌లో లివర్‌ కర్రీ అంత బాగుంటుందా..!

ప్రస్తుతం షర్మిలకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నారు. అయితే, తనకు ఫోర్‌ ప్లస్‌ ఫోర్‌ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి లేఖ రాశారు. పోలీస్‌ ఎస్కార్‌ వెహికల్‌ కేటాయించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉందని, పైగా ఎన్నికల వాతావరణం నేపథ్యంలో భద్రత పెంచాలని ఆమె లేఖలో కోరారు. అయితే, ఈ లేఖపై డీజీపీ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. షర్మిల భద్రతకు ముప్పు పొంచి ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. షర్మిల ప్రాణాలకే ముప్పు ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో షర్మిల.. తన భద్రత విషయంలో డీజీపీకి లేఖ రాయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ శ్రేణులు కూడా షర్మిలకు భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ సోదరి అయిన షర్మిల.. తన భద్రత విషయంలో ఆందోళనగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఇక.. రాజకీయంగా షర్మిల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వరుసగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ సమావేశాలకే హాజరవుతున్నప్పటికీ.. త్వరలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే భద్రత పెంచాలని కోరుతూ షర్మిల లేఖ రాశారు. రాబోయే రోజుల్లో షర్మిల వర్సెస్ జగన్ అన్నట్లుగా రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంది.