YS VIVEKANANDA: ఇకపై మాట్లాడొద్దు.. వివేకా హత్య కేసులో కడప కోర్టు కీలక తీర్పు

వివేకా హత్య గురించి అటు వైఎస్ షర్మిల, సోదరి సునీత.. ఇటు అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మధ్యలో దస్తగిరి లాంటి వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కూడా అప్పుడప్పుడూ వివేకా హత్యపై స్పందిస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 18, 2024 / 07:44 PM IST

YS VIVEKANANDA: ఏపీ రాజకీయాల్లో వివేకా హత్య కేసు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య గురించి అటు వైఎస్ షర్మిల, సోదరి సునీత.. ఇటు అవినాష్ రెడ్డి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మధ్యలో దస్తగిరి లాంటి వాళ్లు కూడా మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి కూడా అప్పుడప్పుడూ వివేకా హత్యపై స్పందిస్తున్నారు. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి టార్గెట్‌గా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు.

ROHIT SHARMA: భారత క్రికెట్‌కు మంచిది కాదు.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్

దీంతో కడప సహా ఏపీ రాజకీయాలు వివేకా హత్య అంశంపైనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించవద్దని ఆదేశించింది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతోపాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్, వైఎస్ సునీత సహా ఎవరూ వివేకా హత్య గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసుపై షర్మిల, సునీత చేస్తున్న విమర్శల్ని వైసీపీ తిప్పికొట్టలేకపోతోంది. ఈ అంశం వైసీపీకి ఇబ్బందిగా మారింది. దీంతో వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.

వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేలా రాజకీయ నేతలు వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో పదే పదే మాట్లాడుతున్నారని.. దీనివల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని వైసీపీ నేత సురేష్ బాబు కడప కోర్టును ఆశ్రయించారు. వివేకా హత్యపై మాట్లాడకుండా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. తాజా నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఇకపై ఏపీ రాజకీయాల్లో ఎన్నికలయ్యే వరకు వివేకా హత్య గురించిన ప్రస్తావన వినిపించే అవకాశం లేదు. ఇది ఒక రకంగా వైసీపీకి భారీ ఊరట అనే చెప్పాలి.