YS Sharmila : పార్టీ నేతలతో షర్మిల కీలక భేటీ.. బరిలోకి వైఎస్‌ విజయమ్మ!?

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అంటోంది షర్మిల. ఇవాళ తన పార్టీ ముఖ్య నేతలతో కార్యవర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఇవాళే తమ అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్‌ ఉంది. పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే చెప్పిన షర్మిల ఇప్పుడు పాలేరుతో పాటు మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రెడీ అంటోంది షర్మిల. ఇవాళ తన పార్టీ ముఖ్య నేతలతో కార్యవర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. ఇవాళే తమ అభ్యర్థులను కూడా ప్రకటించే ఛాన్స్‌ ఉంది. పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే చెప్పిన షర్మిల ఇప్పుడు పాలేరుతో పాటు మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక వైఎస్‌ విజయమ్మను కూడా పోటీలో దించాలని పార్టీ నేతలు, కేడర్‌ నుంచి విజ్ఞప్తులు రావడంతో విజయమ్మ కూడా బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఆమెను సికింద్రాబాద్‌ నుంచి పోటీలో దింపే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్‌లో క్రిస్టియన్‌ ఓట్‌ బ్యాంక్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పార్టీకి కలిసివచ్చే అంశం. దీంతో ఇక్కడి నుంచే విజయమ్మను బరిలో దింపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట షర్మిల. మొన్నటి వరకూ కాంగ్రెస్‌ మీద ఆశలు పెట్టుకున్న షర్మిల ఇప్పుడు ఆ పార్టీ హ్యాండ్‌ ఇవ్వడంతో ఒంటరి పోరుకు సిద్ధంమైంది. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందంటూ మొన్నటి వరకూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైఎస్‌ షర్మిల ఈ విషయంలో అధికారికంగా స్పందిచకపోయినా.. ఈ వాదనను మాత్రం ఖండించలేదు. పైగా ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌ పెద్దలను కలిసి వచ్చింది. కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశాల గురించి మాట్లాడినట్టు చెప్పింది. దీంతో త్వరలోనే పార్టీ విలీనం పక్కా అని అంతా అనకున్నారు.

షర్మిలకు కీలక పదవితో పాటు పాలేరు నుంచే టికెట్‌ ఇస్తారు అని కూడా అనుకున్నారు. కానీ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్ల జోక్యంతో పార్టీ విలీనానికి బ్రేక్‌ పడింది. దీంతో అప్పటి వరకూ కాంగ్రెస్‌ నిర్ణయం కోసం వెయిట్‌ చేసిన షర్మిలక ఇక ఒంటరిగానే బరిలోకి దిగుతానని చెప్పింది. పార్టీ నేతలు ఆందోలన పడవద్దని ముందే చెప్పిన షర్మిల ఇవాళ వాళ్లతో కీలక భేటి నిర్వహించబోతోంది. ఈ మీటింగ్‌లో అభ్యర్థుల ఎన్నికలపై పునరాలోచన, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ముఖ్యంగా చర్చించబోతున్నట్టు సమాచారం. మీటింగ్‌ అనంతరం షర్మిల ఎలాంటి ప్రకటన చేస్తుంది. అధికార ప్రతిపక్షాలకు ధీటుగా తన పార్టీ నుంచి ఎలాంటి అభ్యర్థులను బరిలోకి దించుతుందో చూడాలి.