YSRCP MLA’S: వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావ్ బీజేపీలో చేరారు. ఆదివారం, ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో వరప్రసాద్ బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఆయన తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. దాదాపు ఆయన పేరు ఖరారైంది. వరప్రసాద్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.
Soumya Shetty: నువ్వు ఇక మారవా ? సౌమ్య శెట్టిపై మరోకేసు.. ఈసారి ఏం చేసిందంటే..
2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచినప్పటికీ.. ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదు. దీంతో వరప్రసాద్ కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జగన్ ఆయనకు తాజాగా టిక్కెట్ కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో వరప్రసాద్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గతంలో జనసేన అధినేత పవన్‌ను కలిశారు. జనసేన నుంచి గూడూరు టిక్కెట్ ఆశించారు. కానీ, అటునుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో బీజేపీతో టచ్‌లోకి వెళ్లగా తిరుపతి పార్లమెంట్ టిక్కెట్ హామీ వచ్చింది. దీంతో ఢిల్లీలో వరప్రసాద్.. బీజేపీలో చేరారు. వైసీపీ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేల్లో కొందరు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో కూడా చేరుతున్నారు.
ఇటీవల కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ వైసీపీని వీడి, షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా.. ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే వీఆర్.ఎలీజా కూడా కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసంలో ఎలీజా.. కాంగ్రెస్‌లో చేరారు. ఆయనను వై.ఎస్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.