MLA MS Babu: ప్రజా వ్యతిరేకత పేరుతో పలువురికి జగన్ టిక్కెట్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, టిక్కెట్లు దక్కని నేతలు వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, పూతలపట్టు, వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై తీవ్రస్దాయిలో విరుచుపడ్డారు. వ్యతిరేకత పేరుతో పార్టీలో దళితులకు అన్యాయం జరుగుతోందని, అగ్రవర్ణాలపై వ్యతిరేకత ఉన్నా మార్చడం లేదని ఎంఎస్ బాబు అన్నారు. మంగళవారం ఈ అంశంపై మాట్లాడారు.
PONNAM PRABHAKAR: ఎమ్మెల్యే చిలిపి పని.. వివాదంలో మంత్రి పొన్నం..
“నేను చేసిన తప్పేంటో జగన్ చెప్పాలి. ఐదేళ్ళుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారి అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడారా..? జగన్ చెప్పకముందే నేను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగాను. దళితులకు జగన్ ఏం న్యాయం చేశారు. దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా. జగన్ చెప్పిందే చేశాను. ఇప్పుడు నా తప్పంటే ఎలా..? గత అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా. ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత..? ఐప్యాక్ సర్వేలో నాకు అనుకూలంగా లేదని, ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం సరికాదు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు. గత ఎన్నికలలో ఐప్యాక్ సర్వే ఇస్తేనే నాకు టికెట్ ఇచ్చారా..? పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ వైకాపాపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గౌరవం ఉంది. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా.
తిరుపత్తి, చిత్తూరు జిల్లాల్లోని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఓసీల సీట్లు ఒక్కచోటా మార్చకుండా.. కేవలం ఎస్సీ సీట్లే మార్చారు. తిరుపతి, చిత్తూరు జిల్లా ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నా మార్చలేదు” అని ఎంఎస్ బాబు అన్నారు. దీంతో జగన్‌పై ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మరోవైపు.. పూతలపట్టు నుంచి కుతూహలమ్మ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందువల్లే బాబుకు టిక్కెట్ ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు.