ఆ హీరోయిన్ తో డేటింగ్ చేశా యువరాజ్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాషన్ షోలో మోడల్ గా స్టైలిష్ గా ఉండే యువీకి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉండేది.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 05:34 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాషన్ షోలో మోడల్ గా స్టైలిష్ గా ఉండే యువీకి అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఉండేది. బాలీవుడ్ హీరోయిన్లకు సైతం యువీ అంటే క్రష్ ఉండేదని కూడా చాలా మందికి తెలుసు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఆ డేటింగ్ గురించి అప్ప‌టి టీమ్‌మేట్స్‌కు కూడా తెలుసున‌ని, వారంతా త‌న‌ను ఓ సంద‌ర్భంలో ఆట‌ప‌ట్టించార‌న్నాడు. ఆ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది మాత్రం యువ‌రాజ్ సింగ్ చెప్పలేదు. 2007-08 లో తాను ఆస్ట్రేలియా సిరీస్‌తో బిజీగా ఉన్నప్పడు ఆ హీరోయిన్ ఆస్త్రేలియాకు వ‌చ్చింద‌ని యువ‌రాజ్ ఈ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు.

తాను కలవాలనుకుంటున్నట్టు ఆమె చెప్పగా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కావడంతో కాద‌ని రావ‌ద్ద‌ని చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. కానీ తన మాట‌లు ప‌ట్టించుకోకుండా తమ బ‌స్‌ను ఫాలో అవుతూ కాన్‌బెర్రాకు వ‌చ్చిందని యువీ వెల్లడించాడు. తనతో టైమ్ స్పెండ్ చేయ‌డానికే కాన్‌బెర్రాకు వ‌చ్చాన‌ని చెప్పిందని, దీంతో ఆరోజు రాత్రి ఆమెతోనే ఉండిపోవాల్సి వచ్చిందంటూ అసలు విషయం చెప్పాడు. ఆ త‌ర్వాత సినీ కెరీర్‌పై దృష్టిపెట్ట‌మ‌ని ఆమెకు స‌ల‌హా ఇచ్చినట్టు యువీ చెప్పుకొచ్చాడు. యువీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ హీరోయిన్ ఎవరా అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆమె టాప్ హీరోయిన్ గా ఉందంటూ యువీ చెప్పడంతో దీపికా పదుకునే అయి ఉండొచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.