Zombie Virus: కరోనాను మించే వైరస్‌.. ప్రపంచానికి జాంబీ వైరస్ ముప్పు.. పెను ప్రమాదం తప్పదా..?

ప్రస్తుతం భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్‌లో మంచు కరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు భారీ స్థాయిలో కరిగిపోతోంది. దీనివల్ల మంచులో వేల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన వైరస్‌లు బయటికొచ్చే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 03:41 PM IST

Zombie Virus: ప్రపంచాన్ని కోవిడ్ ఎంతగా వణికించిందో తెలుసు. కరోనా దెబ్బకు అన్ని దేశాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. ఇలాంటి వైరస్ మళ్లీ రాకూడదని ప్రపంచం కోరుకుంటోంది. అయితే, ఇంతకంటే ప్రమాదకర వైరస్‌ల ముప్పు ప్రపంచానికి పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అది కూడా.. జాంబీ తరహా వైరస్‌లు విజృంభించే అవకాశం ఉందట. ఇవి మానవాళికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిక్స్-మార్సిల్లే యూనివర్సిటీ పరిశోధకులు గార్డియన్ పత్రికతో సంచలన విషయాలు పంచుకున్నారు.

Pragathi Mahavadi: ప్రగతినా మజాకా.. పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో సిల్వర్ మెడల్

దీని ప్రకారం.. ప్రస్తుతం భూతాపం, వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్‌లో మంచు కరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు భారీ స్థాయిలో కరిగిపోతోంది. దీనివల్ల మంచులో వేల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన వైరస్‌లు బయటికొచ్చే అవకాశం ఉంది. మంచు కరిగి, నీళ్లుగా మారి ఇతర చోటికి వెళ్తాయి. ఈ కరిగే మంచులో వైరస్‌లు కూడా ఉండొచ్చు. సాధారణంగా కొన్ని వైరస్‌లు వేల సంవత్సరాలు మంచులో గడ్డకట్టి ఉండిపోగలవు. అందులోనూ జాంబీ తరహా వైరస్‌లు 48,500 సంవత్సరాలపాటు ఉండిపోతాయి. భూతాపంతో మంచు కరిగినప్పుడు, అవి వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇదే గనుక జరిగితే.. ఈ వైరస్‌లు మానవులకు సోకి, పెనుముప్పుగా మారొచ్చు. ఈ జాంబీ వైరస్‌లు విజృంభిస్తే, కోవిడ్ కంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ వైరస్ జనాల్లోకి వస్తే.. ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయ్‌.. ఎలాంటి నష్టాలు వస్తాయని అంచనా వేసేందుకు చాలామంది శాస్త్రవేత్తలు.. పరిశోధనలు జరిపారు.

సైబీరియన్‌ ఏరియాలోని మంచు కప్పుల్లో ఉన్న నమూనాలను పరిశీలించిన సైంటిస్టులకు.. ఈ వైరస్‌ దాదాపు కొన్ని వేల ఏళ్ల నుంచి భూమిలో ఉండిపోయినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు మంచు కరిగి అవి బయటికి వస్తే.. భారీ ప్రమాదమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందుగా ఈ వైరస్‌ వ్యాప్తి ప్రపంచానికి దక్షిణ ప్రాంతాల్లో మొదలై.. ఉత్తరానికి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఉత్తరాది ప్రాంతంలో బయటపడి.. ఆ తర్వాత దక్షిణాదికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఈ వైరస్ కారణంగా.. పోలియోలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబీరియా ప్రాంతంలో ట్రాఫిక్‌ పెరగడం, ఆయిల్‌ వెలికితీయడం, పారిశ్రామిక అభివృద్ధిలాంటి కారణాలతో… ఆర్కిటిక్‌ మహాసముద్రంలో భారీగా ఐస్‌ కరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సైంటిస్టులు. మినరల్స్‌, ఆయిల్‌ కోసం చేస్తున్న పెద్ద పెద్ద రంధ్రాల కారణంగా.. పెను ముప్పు పొంచి ఉందని.. వాటికోసం లోపలికి వెళ్లే వాళ్లకు ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. అలా ఐస్‌ కింద దాగిఉన్న వైరస్‌ భూమి మీదకి వచ్చి అల్లకల్లోలం సృష్టించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.