LPG cylinder : మహిళలకు భారీ ఊరట.. పార్లమెంట్ ఎన్నికల ముందు భారీగా LPG సిలిండర్ల ధరలు తగ్గింపు..?

గ్యాస్ సిలిండర్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గృహ మహిళలకు భారీ ఊరట లభించింది. గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు భారీ ఉపశమనం కలిగించింది. నిత్యం వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ పై రూ.30.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

 

గ్యాస్ సిలిండర్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గృహ మహిళలకు భారీ ఊరట లభించింది. గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు భారీ ఉపశమనం కలిగించింది.
నిత్యం వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ పై రూ.30.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.

అయితే గత నెల మార్చి 1న చమురు కంపెనీలు ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. ఎన్నికల ముందు ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింపు
గత మూడు నెలలుగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుదల ప్రభావం చూపుతోంది. అయితే మూడు నెలల తర్వాత ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించారు. ఏప్రిల్ 1, 2024న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 30.50 తగ్గాయి.

హైదరాబాద్‌లో కూడా 19కిలోల సిలిండర్ ధర తగ్గినట్లు తెలుస్తోంది. గత నెలలో రూ. 25 పెరిగి రూ. 2027 కు చేరగా ఇప్పుడు రూ. 30.50 తగ్గింది. హైదరాబాద్‌లో 14కిలోల గ్యాస్ ధర రూ. 855 గా ఉంది. అలాగే ఉజ్వల యోజన లబ్ధిదారులకు రూ. 300 సబ్సిడీ ఉండగా వారికి రూ. 503 నుండి రూ. 555 కే గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండటం విశేషం.

  • తెలుగు రాష్ట్రాల్లో దేశీయ గ్యాస్‌ సిలిండర్ ధరలు:

హైదరాబాద్‌లో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(LPG Cylinder Price) రూ. 855కి అందుబాటులో ఉంది.
విజయవాడలో 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ‍‌(LPG Cylinder Price) రూ. 855కి అందుబాటులో ఉంది.

దేశంలోని (31-3-2024) ప్రధాన నగరాల్లో గతంలో LPG 19KG సిలిండర్ ధరలు:

  • ఢిల్లీ- ₹ 1,795
  • ముంబై- ₹ 1,749
  • కోల్‌కతా- ₹ 1,911
  • చెన్నై- ₹ 1,960.50
  • చండీగఢ్- ₹ 1,816
  • బెంగళూరు- ₹ 1,875
  • ఇండోర్- ₹ 1,901
  • అమృత్‌సర్- ₹ 1,895
  • జైపూర్- ₹ 1,818
  • అహ్మదాబాద్- ₹ 1,816

దేశంలోని (1-4-2024) ప్రధాన నగరాల్లో LPG సిలిండర్ ధరలు:

  • న్యూదిల్లీలో           = రూ. 803
  • ముంబైలో              = రూ. 802.50
  • చెన్నైలో                = రూ. 818.50
  • కోల్‌కతాలో            = రూ. 829
  • నోయిడాలో           = రూ. 800.50
  • గురుగావ్‌లో           = రూ. 811.50
  • చండీగఢ్‌లో          = రూ. 912.50
  • జైపుర్‌లో               = రూ. 806.50
  • లక్‌నవూలో          = రూ. 840.50
  • బెంగళూరులో     = రూ. 805.50
  • పట్నాలో              = రూ. 892.50

SURESH. SSM