Amit Shah Video : అమిత్ షా వీడియో మార్ఫింగ్… కాంగ్రెస్ పైనే అనుమానాలు ?

కేంద్ర హోంమంత్రి (Union Home Minister), బీజేపీ (BJP) సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన వీడియో మార్ఫింగ్ అయింది.

కేంద్ర హోంమంత్రి (Union Home Minister), బీజేపీ (BJP) సీనియర్ నేత అమిత్ షా (Amit Shah) రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన వీడియో మార్ఫింగ్ అయింది. దీనిపై కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉంది. హోంశాఖతో పాటు… బీజేపీ నేతలు కూడా మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా కేసులు పెడుతున్నారు.

అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. తాము SC, ST రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి అమిత్ షా అలా మాట్లాడలేదు. తెలంగాణలోని సిద్దిపేట సభలో అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై మాత్రమే మాట్లాడారు. ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తీసేసి SC,ST,OBCలకు వాటిని పంచుతామని చెప్పారు. కానీ ఆ వీడియోను ఎడిట్ చేసి అందరి రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్టుగా మార్చారు. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అమిత్ షా అసలేం మాట్లాడారో… ఆ వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే ఇలా మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేయడంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు మార్ఫింగ్ చేసి… వీడియోను వైరల్ చేశారంటూ ఆ పార్టీ నేతలు అన్ని రాష్ట్రాల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఎడిట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్న ఇలాంటి వీడియోల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఫిర్యాదులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. వీడియోలను ఎక్కడి నుంచి ఎవరెవరికి షేర్ చేశారో కొన్ని లింకులను కూడా హోంశాఖ జత చేసింది. ఇటు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కూడా కేసు పెట్టారు. ఈ కేసులో దేశవ్యాప్తంగా కొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయి. వీడియోలను షేర్‌ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు.

అమిత్ షా బహిరంగసభ జరిగింది తెలంగాణలో కాబట్టి… హైదరాబాద్ లోనే ఈ మార్ఫింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచే ముందుగా షేర్ కావడంతో కాంగ్రెస్ నేతల ప్రమేయంపైనా ఎంక్వైరీ చేసే అవకాశముంది. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు ప్రశ్నిస్తారని అంటున్నారు.

ఈ వీడియో వైరల్ అయ్యాక… సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలంతా బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. ఇందులో రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం అంటూ సంఘ పరివార్ ను కూడా లాగడంతో బీజేపీ సీరియస్ గా ఉంది.